NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఏపిలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ ద్వివేది వ్యవసాయ శాఖకు బదిలీ అయ్యారు. గోపాలకృష్ణ ద్వివేది అదనంగా ఉన్న గనుల శాఖ కు ముఖ్య కార్యదర్శిగా కొనసాగనున్నారు. రీసెంట్ గా జాయనింగ్ రిపోర్టు చేసిన తెలంగాణ మాజీ సీఎం సోమేష్ కుమార్ పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఏపీ సీఐడీ డీజీగా సీనియర్ ఐపీఎస్ సంజయ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఫైర్ సర్వీసెస్ (విపత్తు నిర్వహణ) డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం సీఐడీ చీఫ్ గా ఉన్న పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే అత్యంత కీలకమైన ఏపీ సీఐడీకి చీఫ్ గా మూడేళ్లకు పైగా బాధ్యతలు నిర్వహించి సునీల్ కుమార్ కు ఇటీవలే డీజీగా పదోన్నతి లభించింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడిలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు రావడం పోలీస్ శాఖ లో హాట్ టాపిక్ అయ్యింది. అంతర్గత బదిలీలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. అయితే బదిలీ నేపథ్యంలో సునీల్ కుమార్ చేసిన ట్వీట్ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తాను డీజీపీ కాబోతున్నాననే సంకేతాలను పరోక్షంగా సునీల్ కుమార్ ట్వీట్ ద్వారా చెప్పారన్న చర్చ జరుగుతోంది.

AP Govt

 

డీజీపీగా పదోన్నతి పొందిన తర్వాత సీఐడీని విడిచిపెడుతున్నా, సీఐడీ లో మూడేళ్లు అధ్బుతమైన, మరపురాని ప్రయాణం చేశాను, సీఐడీలో నాకు డీజీపీగా ఎలివేషన్ వచ్చింది. అవకాశం కల్పించి నా కర్తవ్య నిర్వహణలో పూర్తి సహకారం అందించినందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ధన్యావాదాలు అంటూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు.

మరో పక్క పంచాయతీ రాజ్ శాఖ నుండి వ్యవసాయ శాఖకు బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డవలప్ మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మూడున్నర సంవత్సరాల బాధ్యతలు నిర్వహించిన తర్వాత గౌరవ ముఖమంత్రి ఇప్పుడు రాష్ట్ర రైతులకు సేవ చేయడానికి అవకాశం కల్పించారన్నారు. నూతన పోస్టులోనూ తాను సేవలందించి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. తన పదవీ కాలంలో సపోర్టు ఇచ్చిన పీఆర్ అండ్ ఆర్ డీ డిపార్ట్ మెంట్ లో సంబంధించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

AP High Court: జీవో నెం.1 పై విచారణ రేపటికి వాయిదా.. అత్యవసర విచారణ జరపడంపై సీజే ఘాటు వ్యాఖ్యలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk