NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Special Status: ఏపి ఆశలో నీళ్లు చల్లిన కేంద్రం .. తెలుగు రాష్ట్రాల భేటీ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశం తొలగింపు..! ఎందుకంటే..?

AP Special Status: ఏపి, తెలంగాణ విభజన అంశాలపై ఈ నెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముందుగా తొమ్మిది అంశాలతో కేంద్ర హోంశాఖ అజెండాను రూపొందించింది. వీటిలో ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చారు. ఈ అజండాను పేర్కొంటూ ఈ ఉదయం రెండు రాష్ట్రాలను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం అనూహ్యంగా దాన్ని వెనక్కు తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఈ ఉదయం జారీ చేసిన అజెండాలో మార్పులు చేసి కొత్త అజెండాతో సర్కులర్ జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన సర్కులర్ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది కేంద్ర హోంశాఖ. కేవలం అయిదు అంశాలతో మాత్రమే అజెండా తయారు చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విభజన అంశం, తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పన్నుల విషయంలో లోటుపాట్లు, నగదు నిల్వ, బ్యాంకు డిపాజిట్లు, రెండు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖల్లో నగదు క్రెడిట్ జమ అంశాలపై చర్చ జరగనుంది.

AP Special Status issue disappear in meeting agenda
AP Special Status issue disappear in meeting agenda

అజెండా మార్పునకు కారణం ఏమిటంటే..

ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఏపి వ్యాప్తంగా సంతోషం వ్యక్తం అయ్యింది. ఇది తమ ఘనతగా వైసీపీ ఎంపీలు చెప్పుకున్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు స్పందిస్తూ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా అని ప్రశ్నించారు. ఆ అజెండాపై స్పష్టత తీసుకునేందుకు కేంద్రంలోని సీనియర్ అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదనీ, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే సంబంధించిన అంశమని అదే విధంగా రెవెన్యూ లోటు కూడా ఏపికి మాత్రమే సంబందించిన అంశమని ఈ రెండు అంశాలు అజెండాలోకి ఎలా వచ్చాయని జీవీఎల్ వాకబు చేశారు.

ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్ధికపరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ అని ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు అస్కారం లేదని తెలిసిందనీ, దీంతో మళ్లీ కొత్త అజెండాతో కేంద్ర హోంశాఖ సర్క్యులర్ జారీ చేసిందన్నారు. ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉండటంతో వివరణ ఇస్తున్నానని పేర్కొన్నారు జీవీఎల్ నర్శింహరావు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N