AP telangana Water war: పార్టీలు వేరైనా ఆ విషయంలో అందరి స్ట్రాటజీ ఒక్కటే..!!

Chandrababu KCR: Double Game in Telugu Politics
Share

AP telangana Water war: ఏపిలో టీడీపీ గానీ, వైసీపీ గానీ ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులను దూషించడానికి, విమర్శించడానికి అదే సామాజిక వర్గ నేతలను ముందు పెడుతుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లను తీవ్ర స్థాయిలో విమర్శించాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించాలంటే వైసీపీలో మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు లాంటి నాయకులను, వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలను విమర్శించాలంటే టీడీపీ అదే సామాజిక వర్గంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తదితరులు, అదే విధంగా బీసీ, ఎస్సీ తదితర సామాజిక వర్గాల నేతలను ప్రత్యర్థి పార్టీలోని అదే సామాజిక వర్గ నేతలు విమర్శించడం చూస్తున్నాం.

AP telangana Water war
AP telangana Water war

Read more: AP CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ‌ను సత్కరించిన వైసీపీ క్షత్రియ నేతలు..! ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

ఇప్పుడు తెలంగాణ, ఏపి జలజగడం విషయంలో సీఎం కేసిఆర్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనబడుతోంది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని విమర్శించడానికి తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ముందు పెట్టారు. ఇతర కులాలకు చెందిన నేతలతో జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ అభిమానుల్లో, రెడ్లలో వ్యతిరేకత వస్తుందనుకున్నారో ఏమో గానీ ప్రశాంత్ రెడ్డి అస్త్రంగా వదిలారు. దీంతో ప్రశాంత్ రెడ్డి కెసిఆర్ మెప్పు కోసం దివంగత నేత వైఎస్ఆర్, ఏపి సీఎం జగన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో ఘాటైన పదజాలంతో విమర్శిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణను నాడు వైఎస్ఆర్ అడ్డుకుని ఎంతో మంది బలికావడానికి కారకుడైయ్యారనీ, వైఎస్ఆర్ ముమ్మాటికీ తెలంగాణ పాలిట రాక్షసుడని ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జలచౌర్యంలో తండ్రిని మించిన తనయుడు జగన్ అని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీతో రెడ్డి సామాజిక వర్గం చాలా వరకూ టీఆర్ఎస్ కు దూరం అవుతారన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పట్ల రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం జగన్ ను టార్గెట్ చేసేందుకు కేసిఆర్ ఏపి రాజకీయ నాయకుల స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు స్పష్టం అయ్యింది.


Share

Related posts

ప్రత్యేకహోదా వంచనపై ఢిల్లీలో వైకాపా గర్జన దీక్ష

somaraju sharma

అదేంటీ.. సీఎం జగన్ ను చంద్రబాబు అంత విసిగిస్తున్నారా..?

Muraliak

Eatela Rajendar: కేసీఆర్ కు అదిరిపోయే షాక్ రెడీ చేస్తున్న ఈట‌ల రాజేంద‌ర్

sridhar