NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Three Capital Issue: ఏటూ తేల్చని జగన్..! త్వరలో మెరుగైన బిల్లు అంట..?

AP Capitals Bill: New Bill New Thoughts in CM Mind

AP Three Capital Issue: మూడు రాజధానుల అంశానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ ఎటూ తేల్చలేదు. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఇంతకు ముందు ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు.  తొలుత మూడు రాజధానుల బిల్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీలో దీనిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని అందరూ భావించారు. అయితే జగన్ దీనిపై ఏమీ తేల్చకుండా పూర్తి స్థాయిలో మరో బిల్లును తీసుకురానున్నట్లు తెలిపారు.  తొలుత అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు వచ్చింది. ఈ బిల్లును ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. బిల్లుపై చర్చకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించారు.

AP Three Capital Issue: cm ys jagan speech in assembly
AP Three Capital Issue cm ys jagan speech in assembly

AP Three Capital Issue: అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు

చర్చ అనంతరం సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ 1953 నుండి 56వరకు ఏపిలో రాజధానిగా కర్నూలు ఉండేది,  గుంటూరులో హైకోర్టులో ఉండేది. ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే ప్రేమ కూడా ఉంది. ఈ ప్రాంతం అటు విజయవాడ, ఇటు గుంటూరుకు దగ్గర ఏమీ కాదు. ఇక్కడ  రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల ఏర్పాటుకు మాత్రమే అయ్యే ఖర్చు లక్ష కోట్లు అని లెక్కేశారు. అది ఈ రోజు లెక్కల ప్రకారం, పదేళ్లు పోతే ఆ ఖర్చు ఆరు లక్షల కోట్లో 7 లక్షల కోట్లు అవుతుంది. రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఇంకా ఉపాధి అవకాశాల కోసం పెద్దనగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మన పిల్లలు వెళ్లాల్సిందేనా అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉదేశంతోనే విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిగా మూడు రాజధానులను తీసుకువచ్చామన్నారు.  డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి చేయాలని తలంచామన్నారు.

AP Capitals Bill: CM Jagan Still Confusing in Capitals

విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే..

ఈ ఏడాదిన్నర కాలంగా రకరకాలుగా అపోహాలు కల్గిస్తూ, న్యాయపరమైన చిక్కులు తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మూడు రాజధానుల ప్రక్రియ వెంటనే ప్రారంభం అయి ఉంటే ఈ పాటికే మంచి ఫలితాలు కనబడేవన్నారు. శ్రీభాగ్ ఒప్పందం స్పూర్తితో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగానే గడచిన రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో గెలవడం జరిగిందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహనం కల్పించి, పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లును సభ ముందుకు తీసుకువస్తామని సీఎం జగన్ అన్నారు. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

AP Capitals Bill: New Bill New Thoughts in CM Mind

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!