AP Weather Updates: ఏపిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ ప్రభావం రోజురోజుకు అధికంగా ఉంటోంది. భానుడి ప్రతాపం ఒక వైపు, మరో పక్క వైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ఉదయం 10 గంటల తర్వత రోడ్డుపైకి జనాలు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. దీంతో మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానిష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రతపై ఏపీ విత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తగు సూచనలు అందిస్తొంది. నిత్యం ఏయే ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందో ముందుగానే ప్రజలకు తెలియజేస్తొంది. వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

శనివారం రాష్ట్రంలోని 97 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు (ఆదివారం) 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు మండలాల్లో, అనకాపల్లి ఒకటడి, బాపట్ల లో ఏడు, తూర్పు గోదావరిలో ఏడు, పశ్చిమ గోదావరి లో మూడు, ఏలూరు నాలుగు, గుంటూరులో అత్యధికంగా 17, కాకినాడ తొమ్మిది, కోనసీమలో పది, కృష్ణాలో 15, ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది. పల్నాడులో తొమ్మిది, మన్యం లో నాలుగు, కడప జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు.
మరో పక్క ద్రోణి ప్రభావంతో మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. నేడు మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.