21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపి మహిళా కమిషన్ నోటీసులు ..ఎందుకంటే..?

Share

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశంపై వైసీపీ నేతలు తరచుగా చేస్తున్న విమర్శలపై ఆయన ఇటీవల ఘాటుగా స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విడాకులు తీసుకుని భరణం చెల్లించే పెళ్లి చేసుకున్నానంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపి మహిళా కమిషన్ స్పందించింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను తక్షణం వెనక్కు తీసుకోవాలంటూ నోటీసులో పేర్కొంది ఏపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.

vasireddy Padma

 

భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశం ఇచ్చేలా పవన్ మాటలు ఉన్నాయని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. ఈ మాటలు మహిళా లోకాన్ని నివ్వెరపోయేలా చేశాయన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి రావడం వ్యతిరేక అంశమని పేర్కొన్న వాసిరెడ్డి పద్మ.. చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండని అంత సులువుగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సినిమా హీరోగా, పార్టీ అధ్యక్షుడుగా పవన్ చేసిన వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపిస్తాయని వాసిరెడ్డి పద్మ అన్నారు.

vasireddy Padma Pawan Kalyan

Munugode Bypoll: మునుగోడు ప్రజలకు హస్యాన్ని పండిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఆర్ఒకు నా శాపం తగిలిందంటూ వ్యాఖ్యలు

అలాగే మహిళలను ఉద్దేశించి స్టెఫ్నీ అనే పదం వాడటం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ మాటలు మహిళా భద్రతకు పెను ప్రమాదం గా మారతాయని అన్నారు. అందుకే మహిళా లోకానికి పవన్ క్షమాపణలు చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ నోటీసులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

CM YS Jagan: అందుకే ఆ హామీ నెరవేర్చలేకపోయా.. పోలీసు కుటుంబాలకు సంజాయిషీ ఇచ్చుకున్న సీఎం జగన్


Share

Related posts

NTR: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై రియాక్ట్ అయిన జూనియర్ ఎన్టీఆర్..!!

sekhar

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

Ram

కేసిఆర్ బీఆర్ఎస్ ఈసీ గుర్తింపునకు మోకాలడ్డుతున్న రేవంత్ రెడ్డి.. ఫలించేనా..?

somaraju sharma