AP ZPTC, MPTC Elections: ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..!!

Share

AP ZPTC, MPTC Elections:  ఏపిలో పది జడ్‌పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ కారణాలతో గతంలో ఆగిపోయిన, గెలిచిన అభ్యర్ధులు మరణించిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో ఓట్లు తడిసిన కారణంగా లెక్కింపు నిలిచిపోయిన వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు జడ్‌పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతో పాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. 14 జడ్‌పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేయగా నాలుగు జడ్‌పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు ఎవరూ దాఖలు చేయకపోవడంతో వాయిదా పడ్డారు.

ap zptc, mptc elections updates
ap zptc, mptc elections updates

 

AP ZPTC, MPTC Elections: ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

పది జడ్‌పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు గానూ 954 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. జడ్‌పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్ల 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు గానూ పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు వీల్ చైర్ లు ఏర్పాటు చేశారు. విస్తృత పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కాగా కృష్ణాజిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పరచివర ఎంపీటీసీ స్థానం పరిధిలో ఓటరు స్లిప్ లు అందరికీ పంపిణీ చేయలేదనీ, ఓటరు స్లిప్ లేకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు ప్రచారాన్ని నిర్వహించారు.


Share

Related posts

PV Sindhu: పీవీ సింధుకు రూ.5లక్షల చెక్కు అందజేసిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

Ashwani and Bharani stars అశ్వని ,భరణి  నక్షత్ర పాదాలలో పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

siddhu

Allu Arjun : ఫ్యాన్స్ కి బర్త్ డే నాడు సర్ప్రైజ్ ఇవ్వబోతున్న బన్నీ..!!

sekhar