ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) గ్రుపు -1 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఏపీ పీఎస్‌సీ తన వెబ్ సైట్ లో గ్రుప్ 1 ఫ్రిలిమ్స్ ఫలితాలు ఉంచింది. మెయిన్స్ కు ఎంపికైన 6,455 మంది అభ్యర్ధుల జాబితాను వెస్ సైట్ (psc.ap.gov.in) లో పొందుపరిచింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్ధులు అర్హతత సాధించినట్లు ఏపీపీఎస్సీ వివరించింది.

111 ఉద్యోగాలకు ఏపీపీఎస్‌సీ గ్రుప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను ఈ నెల 8వ తేదీన నిర్వహించింది. మొత్తం 297 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా, 87,718 మంది హజరైయ్యారు. కాగా పరీక్షలు నిర్వహించిన మూడు వారాల్లోనే ఫలితాలు విడుదల చేయడం ఏపీపీఎస్‌సీ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రిలిమ్స్ కు సంబంధించి ఏపీపీఎస్‌సీ ఇటీవల కీ కూడా విడుదల చేసింది.
ఇక ఇదిలా ఉండగా, ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలో మెయిన్స్ కూడా నిర్వహించనున్నట్లు ఇటీవల ఎపీపీఎస్‌సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తాజాగా ఆ షెడ్యుల్ ను కూడా విడుదల చేశారు. గ్రూపు 1 మెయిన్స్ పరీక్షల షెడ్యుల్ ను ఇవేళ వెల్లడించింది ఏపీపీఎస్‌సీ. ఏప్రిల్ 23 నుండి 29వరకూ గ్రుప్ 1 మెయిన్స్ జరుగుతాయని తెలిపింది.
తెలుగు పేపర్ ఏప్రిల్ 23వ తేదీ నిర్వహించనుండగా, ఇంగ్లీషు పేపర్ ఏప్రిల్ 24వ తేదీ నిర్వహించనున్నరు.
ఈ రెండు పేపర్లు క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. వీటిలో వచ్చిన మార్కులను మెయిన్స్ మార్కులతో కలపరు.
ఏప్రిల్ 25న పేపర్ 1 జనరల్ ఎస్సే పరీక్ష
ఏప్రిల్ 26న పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్ 27న పేపప్ 3 పాలిటీ, గవర్నెస్, లా అండ్ ఎథిక్స్
ఏప్రిల్ 28న పేపర్ 4 ఎకానమీ ఇండియా అండ్ ఏపి
ఏప్రిల్ 29న పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణ సమస్యలు
అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తి చేస్తామని ఏపీపీఎస్ సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం ఆమోదిస్తే ఈ సెప్టెంబర్ లో మరో గ్రుప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పారు.