ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారు అందరూ నిజంగా అదృష్టవంతులే. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టినా అదృష్ట వశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వెళుతున్న పల్లె వెలుగు బస్సు ఎదురుగా వస్తున్న ఎక్స్ ప్రెస్ బస్సును తప్పించబోయి వంతెనకు ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం మండ గ్రామ సమీపంలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణీకులు ఉండగా, వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మిగిలిన వారందరూ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్