ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Asani Cyclone: ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట

Share

Asani Cyclone: ఆసని తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా తీర ప్రాంతం వణుకుతోంది. అయితే తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో స్థానికులు బంగారం కోసం వేట కొనసాగిస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతూ..ఈదురు గాలులతో స్థానికులు వణికిపోతున్నారు. కానీ కొందరు మాత్రం వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సముద్రం ఒడ్డున బండ రాళ్లలో బంగారు రేణువుల కోసం వెతుకులాట సాగిస్తున్నారు. పలువురు ఇంటిల్లిపాదీ తీరానికి చేరుకుని ఇసుకలో అన్వేషన చేస్తున్నారు.

Asani Cyclone: Search for gold in Uppada beach,
Asani Cyclone: Search for gold in Uppada beach,

Asani Cyclone: తీరం వెంట బంగారం కోసం వెతుకులాట

ఉప్పాడ తీరంలో కోతకు నిత్యం జనావాసాలు, ఆలయాలు సాగర గర్భంలో కలిసిపోయాయనీ, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయాల్లో బయటపడుతూ ఉంటాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. బంగారం దొరుకుతుండటంతో మత్స్యకారులు, స్థానికులు సమీప ప్రాంతాల ప్రజలు ఉప్పాడ తీరంలో తిష్టవేశారు. గత సంవత్సరం నవంబర్ నెలలోనూ బంగారం కోసం జనాలు గాలించారు. ఇప్పుడు మళ్లీ తుఫాను కారణంగా అలలు ఎగిసి పడుతుండటంతో సముద్రంలో కలిసిన బంగారం తమకు దొరుకుందన్న ఆశతో పెద్ద సంఖ్యలో తీరం వెంట వెతుకులాట సాగిస్తున్నారు. తుఫాను ప్రభావంతో వేరే దేశానికి చెందిన ఓ బంగారు రధం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే.

 


Share

Related posts

జగన్ ఏడాది పరిపాలన జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్న వైసీపీ నేత..!!

sekhar

అప్పుడు తొడగొట్టాడు… ఇప్పుడు భూతద్దమెసినా కన్పించట్లే…!!

sekhar

త్రివిక్రమ్ మూవీ విషయంలో జాగ్రత్త పడుతున్న ఎన్టీఆర్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar