Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఆసని దిశ మార్చుకోంది. ఉత్తర కోస్తా – ఒడిశా మద్య తీరం దాటుతుంది అనుకున్న తుఫాను కృష్ణాజిల్లా మచిలీపట్నం వైపు దూసుకువస్తొందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు సాయంత్రంలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్న ఐఎండి భావిస్తోంది. తుఫాను నేపథ్యంలో కాకినాడ, విశాఖ పోర్టులో పదవ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Asani Cyclone: రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
తీరాన్ని దాటే సమయంలో 75 కి.మీ నుండి 85 కి.మీ వేగంతో గాలాలు వీస్తాయనీ, వచ్చే 12 గంటల్లో మోస్తరు నుండి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ రోజు రాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ డైరెక్టర్ డా బిఆర్ అంబేద్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఏస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
సహాయక చర్యలకు ఏస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసినట్లు తెలిపారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుపాను నేపధ్యంలో కోస్తాంధ్ర జిల్లా యాత్రాంగాలను విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.