ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ కొత్త గేమ్ … అచ్చెన్నాయుడు బుక్క‌యిపోతున్నారా?

Share

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం గేమ్ మార్చుతోందా? అచ్చెన్నాయుడు దూకుడుకు బ్రేకులు వేసేందుకు ప్ర‌ణాళిక మార్చారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

తాజాగా అచ్చెన్నాయుడు కౌంట‌ర్ దానికి స్పంద‌న‌గా వ‌చ్చిన కౌంట‌ర్లు దీన్ని నిజం చేస్తున్నాయి. సంతబొమ్మాలీలో విగ్రహాల ధ్వంసం జరగలేదని, నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశార‌ని అచ్చెన్నాయుడు వివ‌రించారు. పోలీసులు లేకపోతే వైసీపీ పోటీ చేసే దైర్యమే లేదని ఆయ‌న కామెంట్ చేశారు. అయితే, దీనికి పోలీసు అధికారులు స్పందించ‌డం గ‌మ‌నార్హం.

అచ్చెన్నాయుడు సంచ‌ల‌నం

ప్రతి ఇంటికి ప్రభుత్వ అన్యాయాలు,అక్రమాలను, దేవాలయాల పై చేస్తున్న దాడులను వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మా పరిరక్షణ యాత్ర జరుగుతుందని అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు. పోలీసులు లేకపోతే వైకాపాకు పోటీచేసి దైర్యమే లేద‌ని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల వ‌లే పోలీసుల వ్యవహరిస్తున్నారు అని అన్నారు. మంత్రులందూరు వెస్ట్ ఫేలోస్ అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతి ఎన్నికలపై మాట్లాడటం ఏంటి? ఛాలెంజ్ చేయడం పారిపోవడం వారికి అలవాటుగా మారింది అని పేర్కొన్నారు.

పోలీసు అధికారుల సంఘం కౌంట‌ర్

తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నానాయుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత కానిస్టేబుల్ నుండి డీ.జీ.పి. వరకు ఎవరినీ వదలమని, రిటైర్డ్ అయినా ఇంటికి వచ్చి వారి పని చూస్తామని బెదిరించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రావు అన్నారు. ఇటువంటి బెదిరింపు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఇటువంటి బెదిరింపులకు రాష్ట్రంలో పోలీసులు ఎవరూ భయపడరని ఆయన అన్నారు. పోలీసులు రాజ్యాంగబద్దమైన, చట్టాలకు లోబడి విధులు నిర్వర్తిస్తారు తప్పు ఏక పక్షంగానో, కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగానో పని చేయరన్న విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించిన గుడివాడ ఎస్.ఐ. విజయకుమార్ కేసులో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ, రాజకీయ స్వలాభం కోసం తెదేపా నాయకులు వాడుకోవడం గర్హనీయమన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు జరుగుతుందని, ఇటువంటి సమయంలో పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడి తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్నారని అవాస్తవాలను ప్రచారం చేస్తూ కేసు దర్యాప్తును పక్క దోవ పట్టించేందుకు ప్రయత్నించడం విచారకరమన్నారు.


Share

Related posts

Revanth Reddy: రేవంత్ లాగానే ఇంకో రాష్ట్రంలో యువ‌నేత‌కు చాన్స్‌.. సీనియ‌ర్ల‌కు షాక్‌

sridhar

దేశ రాజధానిని పగబట్టిన ప్రకృతి..!!

sekhar

విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar