NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Atchannaidu : అచ్చెన్నాయుడు అరస్ట్ జరిగిన 12 గంటలకే మరొక సంచలనం ??

Atchannaidu : టీడీపీ TDP రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును ఆయన స్వగ్రామం srikakulam శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఈ రోజు ఉదయం పోలీసు అరెస్టు చేశారు. గ్రామ పంచాయతీ నామినేషన్ల సందర్భంలో వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకుని దౌర్జన్యం చేశారన్న అబియోగంపై అచ్చెన్నతో సహా మరో  22 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం ఉదయం అచ్చెన్నాయుడును పోలీసులు భారీ బందోబస్తు నడుమ అరెస్టు చేసి కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే రోజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిమ్మాడ పర్యటన పెట్టుకోవడం విశేషం. ఈ గ్రామంలో అచ్చెన్న కుటుంబీకులకు వ్యతిరేకంగా వైసీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అప్పన్నను పరామర్శించడానికి విజయసాయిరెడ్డి వస్తున్నట్లు ప్రచారం జరిగింది.

Atchannaidu : TDP Chandra babu condemned atchannaidu arrest in srikakulam
Atchannaidu TDP Chandra babu condemned atchannaidu arrest in srikakulam

పోలీసులు అచ్చెన్న అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడుపై నమోదు చేసి తప్పుడు కేసును ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు జగన్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.  నిమ్మాడలో గత నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి ఉద్రిక్తతలు లేవని చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్న అరెస్టును ఖండించారు. నేడు రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడం, మీడియా ముందు మాట్లాడారు. ఈ ఘటన జరిగిన 12గంటలలోపే విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపర్చారు. కారు అద్దాలను ద్వంసం చేశారు. ఈ ఘటనపైనా తీవ్రంగా స్పందించిన పార్టీ అధినేత చంద్రబాబు హుటాహుటిన విజయవాడ గురునానక్ కాలనీలోని పట్టాభి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభిపై దాడికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభికి వ్యక్తిగతంగా ఎవరూ విరోధులు లేరని ప్రజల కోసమే పట్టాభి పోరాడుతున్నారని అన్నారు. పట్టాభిపై మొదటి సారి దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు చంద్రబాబు. ప్రశ్నిస్తే చంపేస్తారా  అని మండిపడ్డారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!