Atmakur By Poll Results 2022: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 20 రౌండ్లలో ఫలితం తేలనుంది. 10.30 గంటల సమయానికి 10 రౌండ్ ల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.
ప్రతి రౌండ్ లోనూ వైసీపీ భారీ ఆధిక్యతలో కొనసాగుతోంది. 10 రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ పై వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 42704 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డ్కి 51,835 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ కు 9131, బీఎస్పీ అభ్యర్ధి ఓబులేసుకు 2741, నోటాకు 2202 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్, రిటర్నింగ్ అధికారి హేరేందిర పరిశీలిస్తున్నారు. ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డికి భారీ మెజార్టీ నమోదు అవుతుండటంతో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు.
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…
ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…
అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్ ఖాన్…