Atmakur By Poll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82వేల పైగా ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గత సంప్రదాయాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్ధులను పోటీ పెట్టలేదు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికల్లో వైసీపీ లక్ష మెజార్టీ లక్ష్యంగా ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ చేసినా పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోవడంతో మెజార్టీ 82వేలు వచ్చింది.
2019 ఎన్నికల్లో ఒక లక్షా 74వేల ఓట్లు పోల్ కాగా ఇప్పుడు ఉప ఎన్నికల్లో లక్షా 37 వేల ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. బీజేపి తరపున రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు ప్రచారం నిర్వహించినా 20వేల ఓట్లు దాటలేదు. బీజేపి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఉప ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ తో సహా 14 మంది అభ్యర్ధులు రంగంలో నిలవగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది పరిశీలిస్తే…
వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ రెడ్డికి 1,02,241
బీజేపి అభ్యర్ధి భరత్ కుమార్ 19,332
బీఎస్పి అభ్యర్ధి ఓబులేషు 4,897
నోటా 4,197
ఇతరులు 6,622
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి గౌతమ్ రెడ్డికి 92,758 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి బొల్లినేని కృష్ణయ్యకు 70,482 ఓట్లు వచ్చాయి. 22,276 ఓట్ల మెజార్టీతో గౌతమ్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…