29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాచర్ల ఘటనలో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు.. టీడీపీ ఇన్ చార్జి బ్రహ్మరెడ్డి తదితరులపై హత్యాయత్నం కేసు

Share

పల్నాడు జిల్లా మాచర్ల లో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ ఇన్ చార్జి బ్రహ్మారెడ్డి, బాబూఖాన్ తదితరులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ ల కింద కేసు నమోదు అయ్యింది. టీడీపీ శ్రేణులపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వగా, తామే చేసినట్లుగా భావించి బ్రహ్మారెడ్డి, బూబూఖాన్ మరి కొంత మంది తమపై హత్యాయత్నంకు పాల్పడ్డారని చల్లా మోహన్ ఫిర్యాదు చేశారు. దీంతో బ్రహ్మారెడ్డి సహా 9 మందిపై ఐపీసీ307, 143, 147, 148, 324, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంటిపై దాడి చేసిన కేసులో అన్నపూర్ణ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తురక కిషోర్ తో పాటు మరి కొందరిపై 435, 437, 448 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

Macharla

కాగా మాచర్ల ఘటనలపై పోలీసు వైఫల్యం లేదని జిల్లా ఎస్పీ రవిశంకర్ తెలిపారు. మాచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ ఆఫీసును ఎవరూ తగలబెట్టలేదనీ, కొంత ఫర్నీచర్ ను బయటవేసి నిప్పు పెట్టారని తెలిపారు. మాచర్లలో కిరాయి హంతకులు ఉన్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్ చేశామన్నారు. కాని పెద్దగా అనుమానితులు దొరకలేదని అన్నారు. గతంలో ఫ్యాక్షన్ లో ఉన్న వాళ్లు నిన్నటి ఘర్షణలో పాల్గొన్నారని చెప్పారు. వారందరినీ గుర్తించామని ఎస్పీ తెలిపారు.

ఏపి లో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం .. విద్యాశాఖలో వచ్చే ఏడాది నుండి ఆ విధానం


Share

Related posts

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా … ఇది మీకు బంగారం లాంటి వార్త !

sekhar

KCR ఫ్లాష్ బ్రేకింగ్: తెలంగాణ ఉద్యోగస్తులకు 30 శాతం పిఆర్సి పెంచిన కేసీఆర్..!!

sekhar

Shalini Pandey: టాలీవుడ్‌ని వదిలేసానన్న ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్!

Ram