Badvel By Poll: ఈ “మిరాకిల్” జరగొచ్చు..!? ఓటింగ్ శాతమే కీలకం!

Share

Badvel By Poll:  మరి కొద్ది గంటల్లో కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు సాయంత్రానికి పోలింగ్ పూర్తి అవుతుంది,. నవంబర్ 2వ తేదీ ఎన్నికల ఫలితం వెల్లడి కానున్నది. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు అధికం. వైఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొదటి నుండి కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గం ఆ తరువాత వైసీపీకి డైవర్ట్ అయ్యింది. 2014 నుండి వైసీపీ అభ్యర్ధులే గెలుస్తూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ నుండి వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుండి పనతల సురేష్, కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ పోటీలో ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణిని వైసీపీ అభ్యర్థిగా నిలిపిన నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికలలో అభ్యర్ధులను పోటీకి నిలపలేదు. రేపు ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి..

Badvel By Poll political review
Badvel By Poll political review

1952 లో బద్వేల్ నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల నుండి ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయ్యింది. మొత్తం 2,16,139 మంది ఓటర్లు ఉండగా అందులో 1,07,340 మంది మహిళలు. 1,08,799 మంది పురుష ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. బద్వేల్, కలసపాడు, బి కోడూరు, ఎస్ ఏ కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, అల్టూరు మండలాలు. ఇప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరగ్గా, ఆరు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. నాలుగు పర్యాయాలు టీడీపీ, వైసీపీ రెండు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు.

Badvel By Poll:  గత ఫలితాలు ఇలా…

2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి చిన్నయ్య పై కాంగ్రెస్ అభ్యర్ధి కమలమ్మ 36వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి టి జయరాములు టీడీపీ అభ్యర్ధి విజయ జ్యోతిపై 9,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన జయరాములు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ అయ్యాడు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ఓబులాపురం రాజశేఖర్ పై వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ వెంకట సుబ్బయ్య 44వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 2,337 ఓట్లు మాత్రమే రాగా బీజేపీ అభ్యర్ధికి 735 ఓట్లతో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. వైసీపీ అభ్యర్ధికి 95వేల ఓట్లు రాగా టీడీపీ అభ్యర్ధికి 50వేలకు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ కంటే నోటాకు 2వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

బీజేపీకి ఎన్ని ఓట్లు..

వాస్తవానికి బద్దేల్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. క్షేత్ర స్థాయి పార్టీ నిర్మాణం కూడా లేదు. గతంలో బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే ఆ పార్టీ బలం ఏమిటో స్పష్టం అవుతుంది. 2009 బీజేపీ అభ్యర్ధికి సుమారు 1500 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత 2019 ఎన్నికల్లో 750 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీకి బీజేపీ ప్రధాన పోటీ దారుడుగా నిలిచింది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి 40వేల నుండి 60వేల వరకూ సంప్రదాయ ఓటింగ్ ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ది లేకపోవడం వల్ల ఈ టీడీపీ సానుభూతిపరులు ఓటింగ్ లో పాల్గొని బీజేపీకి ఓటు వేస్తారా లేక నోటా కు వేస్తారా లేక ఓటింగ్ లో పాల్గొనకుండా దూరంగా ఉంటారా అనేది చూడాలి. నియోజకవర్గంలో బీజేపీకి సంప్రదాయ ఓటింగ్ బలం 1500 నుండి 2వేలు మాత్రమే. అంతకు మించి పోల్ అయ్యే ఓట్లు అన్నీ టీడీపీ, జనసేన వి కావచ్చు,. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయి ఉండవచ్చు. ప్రధాన ప్రతిపక్షంతో పాటు జనసేన దూరంగా ఉండటంతో పోలింగ్ శాతం 50 నుండి 60 శాతం మాత్రమే ఉండవచ్చని అంచనా.ఓటింగ్ శాతాన్ని బట్టి వైసీపీ మెజార్టీ అంచనా వేయవచ్చు. ఇక్కడి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు అన్నీ తమ బలమే అని బీజేపీ అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు.

 

 

 

 

 

 

 


Share

Related posts

Anjeer: నానబెట్టిన అంజీరా ప్రతిరోజు తింటే.. ఎన్ని సమస్యలకు చెక్ పెట్టచ్చో తెలుసా..!!

bharani jella

మిల్కీ బ్యూటీ బాగా కాస్ట్లీ గురూ!! ఒక్క నెలకే అంత రేటా?

sowmya

పూజా హెగ్డే కి టాలీవుడ్, బాలీవుడ్ కంటే కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ ..?

GRK