Balaiah Fans: బాలయ్యకు హిందూపురం అభిమానులు బిగ్ ట్విస్ట్..!!

Share

Balaiah Fans: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (బాలయ్య) టీడీపీ స్టాండ్ కు అనుగుణంగా రాజధాని అమరావతికి మద్దతు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోని బాలయ్య అభిమానులు మాత్రం మూడు రాజధానులకు మద్దతు తెలియజేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతు ర్యాలీలో బాలయ్య అభిమానులు పాల్గొనడం విశేషం.అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ పార్టీ కార్యకర్తలతో కలిసి మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సాగుతున్న క్రమంలో దీనిలో పాల్గొన్న విద్యార్ధులు ఒక్క సారిగా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురైయ్యారు. వైసీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై విద్యార్ధులను వారించి యధావిధిగా ర్యాలీని కొనసాగించారు.

Read More: Omicron Effect: జగన్ సర్కార్ కీలక నిర్ణయం..! మాస్క్ లేకపోతే మూడినట్లే..!!

Balaiah Fans: మూడు రాజధానులకు మద్దతుగా..

ఓ పక్క అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతాంగం కోర్టు అనుమతితో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం హైకోర్టులో మూడు రాజధానుల బిల్లులను ఉప సంహరించుకుంటున్నట్లు తెలియజేయడం తెలిసిందే. ఆ తరువాత అసెంబ్లీ, మండలిలోనూ ఆ బిల్లులను రద్దు చేస్తూ తీర్మానాలను ఆమోదించింది జగన్ సర్కార్. ఈ పరిణామం తరువాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురంలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

Read More: AP Govt: ఏపి ప్రభుత్వ మరో వెనుకడుగు..! జీవో 59 విత్ డ్రా చేసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడి..!!


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

40 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago