NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహార శైలిపై బాలినేని కీలక వ్యాఖ్యలు .. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు చూపుతానన్న కోటంరెడ్డి

నెల్లూరు జిల్లా వైసీపీలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఆ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) లు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనం రామనారాయణ రెడ్డి స్థానంలో పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేసింది. రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నెదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదటి నుండి వైఎస్ఆర్ ఫ్యామిలీకి వీర విధేయుడు కావడంతో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో పార్టీ ఆదేశాల మేరకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం నెల్లూరుకు వెళ్లారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో చర్చలు జరిపి బుజ్జగించే ఏర్పాట్లు చేశారు. అయితే బాలినేని ఆహ్వానించినా చర్చించేందుకు కోటంరెడ్డి రాలేదు. తాను చర్చలకు ఆహ్వానించినా రాకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి .. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కీలక కామెంట్స్ చేశారు.

kotamreddy sridhar reddy

 

పార్టీ మారాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కోమటిరెడ్డిపై  బాలినేని మండిపడ్డారు. కోటంరెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు పోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలోకి పోవాలనుకున్న వాళ్లే ఇలాంటివి చెబుతారని బాలినేని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అన్నారు. ఆధారులు ఉంటే నిరూపించాలని పేర్కొన్నారు. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తే కాల్ రికార్డు చేశారనీ, అలాంటి కాల్ రికార్డును పోన్ ట్యాపింగ్ అంటారా అని ప్రశ్నించారు. కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డు చేసి లీక్ చేశాడని బాలినేని పేర్కొన్నారు. కోటంరెడ్డి మంత్రి పదవి కావాలని ఆశ పడ్డారని బాలినేని తెలిపారు. అయితే జిల్లాకు ఒకరికే మంత్రి పదవి దక్కుతుందని ఆ నేపథ్యంలోనే కోటంరెడ్డికి అవకాశం లభించలేదన్నారు. అయిదారు సార్లు గెలిచిన వారికి కూడా మంత్రి పదవి దక్కలేదని బాలినేని గుర్తు చేశారు. పదవులు లభించకపోతే పార్టీపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు.

YSRCP

 

బాలినేని వ్యాఖ్యలపై కోటంరెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బుధవారం నిరూపిస్తానని వెల్లడించారు కోటంరెడ్డి. మీడియా ముందుకు సాక్షాలతో వస్తానని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బయటపడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయనే ఇప్పటి వరకూ బయటపెట్టలేదనీ, ఇప్పుడు సాక్షాలు బయటపెట్టక తప్పదని అన్నారు. బాలినేని చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో కోటంరెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సాక్షాధారాలను బయటపెడతామని పేర్కొనడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!