TDP Leader Arrest: కర్నూలు జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ని పోలీసులు ఆర్థరాత్రి అరెస్టు చేశారు. ఆయనను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జనార్థన్ రెడ్డిపై ఐపీసీ 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేశారు.
బీసీ జనార్థన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతంలో కాటసాని రామిరెడ్డి అనుచరులు సంచరిస్తున్న నేపథ్యంలో ముగ్గురికిని టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఈ సందర్భంలో జనార్థన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. వారిలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలు కాగా కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?