రోడ్డుపై బీరు బాటిళ్లతో వెళుతున్న వ్యాన్ బొల్తా పడటంతో ఒక్క సారిగా జనాలు ఎగబడ్డారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లు చేతికి అందినన్ని బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అసలే ఎండా కాలం కావడంతో మందుబాబులు ఈ అవకాశాన్ని జార విడుచుకోలేదు. అటుగా వెళుతున్న వాళ్లు, బస్సులో ప్రయాణీకులు ఒక్క ఉదుటున పరుగు లంకించుకుని చంకలో రెండు, ఒక చేతిలో రెండు, మరో చేతిలో రెండు ఇలా బాటిళ్లు పట్టుకుని వెళ్లిపోయారు. ప్రమాదంలో కొన్ని బాటిళ్లు పగిలిపోగా, మరి కొన్ని అట్టపెట్టెల్లో ఆలాగే పడిపోయాయి. పగిలిన బాటిళ్లు తప్ప అట్టపెట్టెల్లోని బీరు బాటిళ్లు మొత్తం జనాలు తీసుకువెళ్లిపోయారు.

అనకాపల్లి లోని కసికోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై ఈ వ్యాన్ బోల్తా కొట్టింది. బీర్ల లోడు వ్యాన్ అనకాపల్లి డిపో నుండి నర్సీపట్నం డిపోకు వెళుతుండగా బొల్తా కొట్టింది. దీంతో బీర్లు నేలపాలు అయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి జనాలను కంట్రోల్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అప్పటికే పగిలిపోయిన బాటిళ్లు కాకుండా మిగిలిన బాటిళ్లు దాదాపు అక్కడ ఖాళీ అయిపోయాయి. ఆ సమయంలో కొందరు యువకులు తమ సెల్ ఫోన్ లో జనాలు బీరు బాటిళ్లు ఎత్తుకెళ్లుతున్న దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
Breaking: కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
అనకాపల్లి కసింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బీర్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా. బీరుల కోసం పరుగులు తీసిన జనం. 200 కేసుల బీర్ బాటిల్స్ నేలపాలు. #AndhraPradesh#Visakhapatnam #Vizag pic.twitter.com/OY3PxLonJT
— Vizag News Man (@VizagNewsman) June 6, 2023