Chinnaganjam (Bapatla): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీలకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్ లను దుశ్సాలువాలతో సత్కరించి ప్రశాంసాపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో చిన్న గంజాం మండలం మోటుపల్లి జిల్లా ఉత్తమ పంచాయతీగా ఎంపిక కాగా సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు.

గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీ అవార్డు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సందర్బంలో సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావుతో పాటు గ్రామ కార్యదర్శి కత్తి శైలజ, ఇన్ చార్జి ఎండిఓ స్వరూపరాణి లను సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు సత్కరించారు. కాగా చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసీపీ ఇన్ చార్జి ఆమంచి కృష్ణమోహన్ తమ గ్రామాభివృద్ధికి ఎంతగానో సహాయ సహకారాలు అందించారని సర్పంచ్ సాంబశివరావు ఈ సందర్భంగా పేర్కొంటూ ఆమంచికి కృతజ్ఞతలు తెలిపారు.