NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu: “భీమ్లానాయక్” కట్టడి చర్యలపై చంద్రబాబు సంచలన కామెంట్స్..

Chandrababu: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా నేడు విడుదల అయిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అయిదు షోలకు అనుమతులు ఇవ్వడంతో పాటు టికెట్ ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఏపిలో మాత్రం ప్రభుత్వం సినిమా థియేటర్ల యాజమాన్యాలకు ఆంక్షలు విధించింది. బెనిఫిట్ షోకు అనుమతి లేదనీ, ఎక్కువ ధరలకు టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ముందుగానే అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ ధరల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా ప్రభుత్వం జీవో విడుదల చేయలేదు. రాష్ట్రంలో భీమ్లానాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

Bheemla Naik cinema issue Chandrababu slams cm ys jagan
Bheemla Naik cinema issue Chandrababu slams cm ys jagan

Chandrababu: ఏ వ్యవస్థను జగన్ వదలడం లేదు

భీమ్లానాయక్ సినిమా విషయంలో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను జగన్ వదలడం లేదని అన్నారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లానాయక్ సినిమాపై ఎందుకు అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ .. తన మూర్ఘపు వైఖరిని వీడాలని హితవు పలికారు.

Chandrababu: ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి..

రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి..థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకునేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే.. ఏపి సీఎం మాత్రం భీమ్లానాయక్ పై కక్షసాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు చంద్రబాబు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది, నిలదీస్తుందని పేర్కొన్నారు. భీమ్లానాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!