NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉమ్మ‌డిగుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ ప‌రుగులు పెడుతోందా? ఇక్క‌డ మ‌రోసారి గెలుపు గుర్రం ఖాయ‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ నుంచి మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఇక్క‌డ పోటీ చేస్తున్నారు. ఇక‌, వైసీపీ ఇప్ప‌టికే ఇద్ద‌రిని మార్చింది. పైగా.. తొలిసారి టికెట్ తెచ్చుకున్న మ‌ల్లెల రాజేష్ నాయుడును పార్టీ మార్చేసింది. ఇప్పుడు ఈయ‌న టీడీపీలో చేరిపోయారు. ఇది ప్ర‌త్తిపాటి విజ‌యాన్ని మ‌రింత పెంచింది.

పైగా నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధం లేని కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడుకి వైసీపీ ఇక్క‌డ టికెట్ ఇచ్చింది. అయితే.. దీనిని స్థానికంగా ఉన్న వైసీపీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. అంతా మీ ఇష్ట‌మేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు.. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న స‌ర్దుకు పోయినా.. ఆయ‌న వ‌ర్గం మాత్రం ఫైర‌వుతున్నారు. స్వ‌యంగా మ‌ర్రి ఫోన్లు చేసి పిలుస్తున్నా.. మెజారిటీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు .. కావ‌టి ప్ర‌చారానికి డుమ్మా కొడుతున్నారు.

వ‌చ్చిన వారు కూడా.. హాజ‌రు వేయించుకుని వెళ్లిపోతున్నారు. దీంతో కావ‌టి ప్ర‌చారం.. ప‌ది మందికి త‌క్కువ‌.. ఐదుగురికి ఎక్కువ అన్న‌ట్టుగానే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ప్ర‌త్తిపాటి పుల్లారావు.. కుటుంబంపై వైసీపీ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. వైసీపీ స‌ర్కారు త‌న కుటుంబాన్ని ఎలా వేధించిందీ వివ‌రిస్తున్నారు. త‌న కుమారుడి అరెస్టును ఆయ‌న తెర‌మీదికి తెస్తున్నారు. మూడు ద‌శాబ్దాలుగా ప్ర‌శాంతంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడుకుల చిచ్చు పెట్టార‌ని అంటున్నారు.

ఫ‌లితంగా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంద‌న్న‌ది టీడీపీ నేత‌ల మాట‌. క్షేత్ర‌స్థాయిలో పుల్లారావుకు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌.. టీడీపీ ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌, పుల్లారావు కుటుంబానికి ద‌క్కుతున్న సింప‌తీ వంటివి ఆ పార్టీకి ప్ల‌స్‌గా మారాయి. ఇక‌, వైసీపీలో స‌మ‌న్వ‌య లోపం, ఇరుగు పొరుగు వారిని తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ టికెట్ ఇవ్వడం.. నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వంటివి ఆ పార్టీకి శాపంగా మారాయి. దీంతో టీడీపీ సైకిల్ ప‌రుగులు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?