Breaking: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అచ్యుతాపురం సెజ్ లోని లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. కార్మికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. పరిశ్రమల్లో తరచు ప్రమాదాలు జరుగుతుండటంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న రాత్రి చిత్తూరు జిల్లా అమర్ రాజా ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఇంతకు ముందు కూడా ఫార్మా కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వివాహం జరిగి ఏడాదితిరక్కముందే ..సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. ఎందుకంటే..?