Big Breaking: ఏబీఎన్ రాధాకృష్ణకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..! మరో కేసు నమోదు..!!

Share

Big Breaking:  ఏపిలో జగన్మోహనరెడ్డి సర్కార్ పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిత్యం వ్యతిరేక కథనాలు, వార్తలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సమయంలోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానల్స్ పైనా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆ ఛానల్స్ యాజమాన్యాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో పోలీస్ చర్యలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పైనే నేరుగా ఏపీ సీఐడీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విధులకు ఆటంకం కల్గించారనే అభియోగంపై జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341, 186, 120(బీ) సెక్షన్ల కింద కింద రాధాకృష్ణ పై కేసు నమోదు అయ్యింది. కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు సీీఐడీ బదిలీ చేయనుంది.

Big Breaking: ap cid case filed on abn radha krishna
Big Breaking: ap cid case filed on abn radha krishna

 

Big Breaking: వేమూరి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు

మొన్న హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎంపి వేమూరి రాధాకృష్ణ అక్కడకు వెళ్లారు. స్కిల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ లో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు జరిపారు. ఏపి సీఐడీ అధికారులను రాధాకృష్ణ అడ్డుకున్నారంటూ సాక్షి మీడియాలో కథనం కూడా వచ్చింది. ఈ కథనాన్ని ఏబీఎన్ ఖండించింది. లక్ష్మీనారాయణ స్నేహితుడు కావడంతో ఆయనకు ధైర్యం చెప్పడానికే రాధాకృష్ణ వెళ్లారనీ, ఆయనకు ధైర్యం చెప్పి వెళుతుంటే సీఐడీ అధికారులే సోదాలు పూర్తి అయ్యే వరకు ఉండమంటే ఆయన ఉన్నారని ఏబీఎన్ చెప్పుకొచ్చింది. కావాలనే తమ ఎండీ రాధాకృష్ణ పై దుష్ప్రచారం చేశారని ఏబీఎన్ పేర్కొంది. అయితే తాము సోదాలు నిర్వహిస్తున్న సమయంలో వేమూరి రాధాకృష్ణ వచ్చి విధులకు ఆటంకం కల్గించారంటూ తనిఖీలో పాల్గొన్న అధికారుల ఫిర్యాదుపై జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.


Share

Related posts

Nimmagadda : నిమ్మగడ్డ “పవర్” ఎటువైపు..!? సజ్జలను తీసేస్తే.., బాబుని ఏం చేయాలి..!?

Srinivas Manem

బ్రేకింగ్: మరో మూడు నెలలు సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

Vihari

‘వివరణ అడిగిన ద్వివేదీ’

sarath