NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

Kakinada Sez: ఏమిటి ఇప్పుడు ఈ ఆకస్మాత్తు నిర్ణయం?? ఏదో ఉంది!

Kakinada Sez : కాకినాడ సబ్ భూములపై రైతులు పోరాటం ఈనాటిది కాదు. బుక్ రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం కనీసం పరిహారం కూడా ఇవ్వకుండానే వారిని ముప్పు తిప్పలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసింది. అప్పట్లో ఇచ్చిన పరిహారం తమ భూములకు ఏ మాత్రం సరిపోదని వాదిస్తూ,  ఏళ్లుగా ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకోకుండా తమ భూములు తమకు ఇచ్చేయాలని పోరాడుతున్న రైతులపై ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరుణ చూపించింది.

అసలు ఇది చర్చిలో లేని ఎవరికీ అర్థం కాని విషయం. దీనిమీద ఇప్పుడు ఉద్యమాలూ రైతుల నిరసనలు కూడా అంతగా లేవు. మరి ఈ సమయంలో ప్రభుత్వం ఎక్కడ ఉన్నా ఫైలు బయటకు తీసి రైతుల పక్షాన ఉండటంలో అర్థం ఏమి ఉంటుంది అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. రైతులపై సుదీర్ఘకాల ఉద్యమాల్లో నమోదైన కేసులను ఉపసంహరించుకుంటే ప్రభుత్వం వారికి బోనస్ ఆనందం ఇవ్వడం విశేషం.

Kakinada Sez
Kakinada Sez

Kakinada Sez 2500 ఎకరాల సేకరణ!

కాకినాడ సెజ్ ల పేరుతో 2005 నుంచి చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా కొందరు రైతులు 16 ఏళ్లుగా పోరాడుతున్నారు. ప్రభుత్వం ఆ తర్వాత జిఎంఆర్ యాజమాన్యం ప్రకటించిన పరిహారం తీసుకోవడానికి వారు నిరాకరించి తమ భూములను ప్రభుత్వం సెజ్ ల పేరుతో తీసుకోవద్దని డిమాండ్ చేశారు. మొత్తం 10 వేల ఎకరాల పరిధిలో సెజ్ భూములు సహకరిస్తే దానిలో 2100 ఎకరాలకు సంబంధించిన రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించారు.

అప్పటి నుంచి వారు పలు రకాల ఉద్యమాలు చేశారు. దీనికి పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలికి, ప్రభుత్వం వస్తే ఆ భూములన్నీ తిరిగి రైతులకు ఇస్తామన్నా హామీ మేరకు ప్రస్తుతం రైతులకు భూములు ఇచ్చేందుకు మంత్రివర్గం తీర్మానం చేసింది.

ఎకరాకు 1.50లక్షలు

కాకినాడ భూములకు భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకున్న ప్రభుత్వం ఎకరాకు కేవలం 1.50 లక్షలనే ఇవ్వడంతో రైతులంతా ఎదురుతిరిగారు. ఎకరా భూమి కి లక్ష రూపాయలు ఇస్తే మేమేం చేసుకుంటామంటూ ఆందోళనకు దిగడంతో దానిని ప్రభుత్వం మూడు లక్షలకు పెంచింది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ఆందోళనలు మొదలవగా చంద్రబాబు ప్రభుత్వం తర్వాత దీనిని పూర్తిగా గాలికొదిలేసింది. అంతేకాకుండా రైతుల మీద ఇష్టానుసారం కేసులు పెట్టి జైలుకు పంపడం తో ఉద్యమం ముద్రితమైంది. ఖచ్చితంగా మార్కెట్ విలువ ప్రకారం లెక్క కట్టకుండా, భూముల విలువ ప్రకారం మాత్రమే ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

** కాకినాడ పరిసరాల్లో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో రిఫైనరీ ఏర్పాటుతో పాటు దానికి అనుగుణంగా పలు ఆయిల్ కంపెనీలు కాకినాడ సెజ్కు వస్తాయనే కోణంలో ఈ సెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2007లోకేంద్రం దీనికి అనుమతి ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇవ్వకముందే భూసేకరణను 1884 చట్టం ప్రకారం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో రైతులకు అన్యాయం జరిగింది.

** సెజ్ ను 1035 డాక్టర్ల పరిధి మేరకు మాత్రమే అనుమతి ఇస్తే, అధికారులు ఏకంగా 5120 ఎకరాల భూమిని సేకరించారు. దీంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని యు కొత్తపల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల పరిధిలో 2295 ఎకరాలు, తొండంగి మండలం లో మరో 2398 ఎకరాలు డెకరేషన్ లేకుండానే భూసేకరణకు సిద్ధమయ్యారు.

15 ఏళ్లు గడుస్తున్నా ఈ 4 693 ఎకరాలకు కనీసం అవార్డు కూడా అధికారులు ప్రకటించలేదు. అనంతరం ఓ ఎం జె సి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన భూముల తాలూక నోటిఫికేషన్లు మాత్రం రద్దు కాలేదు. దీంతో పాటు ఓ ప్రైవేటు వ్యక్తి పేరు మీద భూములు కొనుగోలు చేయడం సైతం అప్పట్లో వివాదం అయింది.

అకస్మాత్తుగా భూములు వెనక్కి ఎందుకు??

దివిస్ పరిశ్రమ విషయంలో జగన్ మాట తప్పారు అన్న ప్రచారం ప్రస్తుతం తూర్పుగోదావరిలో బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన జిల్లా గా ఉన్నా తూర్పుగోదావరిలో ప్రాబల్యం తగ్గితే తర్వాత రాజకీయంగానూ ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో వస్తుందని భావించిన జగన్ ఇప్పుడు తూర్పుగోదావరి లోనే రైతుల సమస్యలు గా ఉన్న కాకినాడ సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చే ప్రణాళిక వేశారు అన్నది కాదనలేని సత్యం.

దివిస్ భూముల వ్యవహారం కూడా రైతులకు సంబంధించింది కాబట్టి, ఇప్పుడు అదే జిల్లాలో రైతుల సమస్య మీద జగన్ సానుకూలంగా స్పందించారు అన్న ప్రచారం జరిగితే తప్ప దివిస్ ఈ విషయంలో ప్రభుత్వం బయటకు వచ్చే అవకాశం లేదు. దీంతో జగన్ తన రాజకీయ చతురతను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju