NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

YSRCP : బూడిద కోసం అధికార పార్టీలో తన్నులాట!

YSRCP : ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీలో కొత్త తన్నులాట తెరమీదకు వస్తోంది. ఈసారి బూడిద కోసం ఒకే పార్టీలోని రెండు గ్రూపుల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. బూడిద తమకు కావాలంటే తమకు కావాలని రెండు వర్గాలు పట్టుదలతో ఉండడంతో ఈ పంచాయతీ తాడేపల్లి కు చేరింది.

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నార్ల తాతారావు విద్యుత్ థర్మల్ కేంద్రం ఉంది. సుమారు 1800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి రోజుకు మూడు టన్నుల పైగా బూడిద బయటకు వస్తుంది. బొగ్గు ద్వారా నడిచే ధర్మల్ విద్యుత్ కేంద్రం కావడంతో బొగ్గును కాల్చడం ద్వారా దానిని వేడి చేసి, ఓ పద్ధతి ప్రకారం విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. బొగ్గు మండించడం తర్వాత వచ్చే బూడిదను చెరువు లాంటి ప్రత్యేకమైన పెద్ద గుంత తీసి దానిలో వేస్తారు. ఇది రోజుకు టన్నుల మేర బయటకు వస్తుంది. దీనినే ఫ్లై యాష్ గా పిలుస్తారు.

** గతంలో ఈ బూడిద గాలికి ఎగిరి చుట్టుపక్కల గ్రామాల్లో పడేది. కాస్త గాలి వచ్చినా సరే చుట్టుపక్కల గ్రామాలన్ని బూడిదతో నిండిపోయేవి. అయితే కాలక్రమేణా ఈ బూడిదకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఫ్లై యాష్ తో ఇటికలు తయారు చేయడంతో పాటు రోడ్ల నిర్మాణానికి, ఇతర నిర్మాణాలకు ఎక్కువగా వాడుతుండటంతో ఈ బూడిద మార్కెట్లో ఇప్పుడు సిరులు కురిపిస్తోంది. ఇబ్రహీంపట్నం ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిద కోసం, దానిని దక్కించుకునేందుకు అధికార పార్టీలో ఇప్పుడు రెండు వర్గాల మధ్య విపరీతమైన ఆధిపత్య ప్రదర్శనా కొనసాగుతోంది.

** గతంలో ఈ బూడిద దక్కించుకునేందుకు టెండర్ నిర్వహించేవారు. అయితే దీనిని దక్కించుకోవడం కోసం అధికార పార్టీలో విజయవాడ వేదికగా రాజకీయాలు సాగుతున్నాయి. ఒక వర్గం జగన్ దగ్గర బంధువు మంత్రి అయిన ప్రకాశం జిల్లా నేత బాలినేని శ్రీనివాస రావు పేరును ఉపయోగించుకుంటే, మరో వర్గం ధర్మ కేంద్రం పరిధిలో ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరును ఉపయోగించుకుంటున్నారు.

** రెండు వర్గాలు బలమైన నేతలకు అనుచరులు కావడంతోపాటు వారి బంధువులు గా చలామణి అవుతూ బూడిద కోసం పోటీ పడడంతో ఈ వివాదం సీఎం ఆఫీస్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్ రావు తో పాటు, వసంత కృష్ణ ప్రసాద్ లతో తాడేపల్లి పెద్దలు ఫోన్ లో మాట్లాడే వివాదాన్ని సెటిల్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు వర్గాల్లోని నాయకులు సైతం దీనిమీద పట్టుదలగా ఉండటంతోపాటు, దీని కోసం ఎంత వరకు వెళ్లడానికి నా సిద్ధంగా ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బూడిద పంచాయితీ కనిపిస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju