NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

వెంకన్న నెయ్యి మింగేశారు : చిన్న తిరుపతిలో పెద్ద కుంభకోణం

 

 

 

చిన్న తిరుపతిగా పేరు గాంచిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద నెయ్యి కుంభకోణం ఇప్పుడు పెద్ద విషయం అవుతోంది… ఆపాయ ఉద్యోగులు వాంతులు వేసుకుని మరి స్వామి వారి నెయ్యి పక్క దారి పట్టించినట్లు… అది కూడా భారీగా ఉన్నట్లు తేలింది… ఈ విషయంలో ఇప్పటికే విచారణ నిర్వహిస్తున్న అధికారులకు ఈ వ్యవహారంలో బాద్యులు.. వారి చేసిన ఘానా కార్యాలు విని.. వారిపై కనీసం ఆలయ అధికారులకు అజమాయిషీ లేకపోవడం చూసి బుర్ర తిరిగినంత పని అయ్యింది… ఆలయంలో అనేక లోపాలు.. అసలు స్వామి వారి ప్రసాదాల విషయంలో ఎవరు పట్టించుకోని తీరు ఇప్పుడు చర్చకు దారి తీశాయి..


** ద్వారకా తిరుమల ఆలయాన్ని గోదావరి… ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు చిన్న తిరుపతిగా పిలుస్తారు.. ఏదైనా కారణం చేత పెద్ద తిరుపతి వెళ్లేంత సామర్ధ్యం లేకపోతే తమ మొక్కులను ఇక్కడే చెల్లిస్తారు. రోజు సుమారు 10 వేల మంది.. శనివారాల్లో దాని కంటే రెట్టింపు భక్తులు వచ్చే ఈ ఆలయంలో స్వామి వారి లడ్డు ప్రసాదాల తయారీని ఆలయం సమీపంలో ఉంటె అంబర్ ఖానా లో లడ్డులా తయారీ అంత జరుగుతుంది.. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దేవస్థానం ఉద్యోగులు కొందరు సుమారు 1100 కిలోల నెయ్యి పక్కదారి పట్టించారు.
** లడ్డులా తయారు చేసే అంబర్ ఖన ఉద్యోగులు నెయ్యి విషయంలో పోటీ పది మరి నెయ్యి అమ్ముకున్నట్లు తెలుస్తోంది.. అంటే ఒక ఉద్యోగి రెండు కిలోలు తీస్కుని వెళ్తే మరో ఉద్యోగి అంత కంటే ఎక్కువ అలా పోటీలు వేసుకుని మరి 1100 కిలోల నెయ్యి మాయం చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు..
** నెయ్యితో పాటు పలు వస్తువులు పక్కదారి పట్టినట్లు తేలింది. ఐతే ఆ లెక్కలు ఏవి బయటకు రావడం లేదు. మార్కెట్ లో డిమాండ్.. విలువ ఉన్న వస్తువులను ప్రసాదాల తయారీ వద్ద నుంచి లేపేసినట్లు తెలుస్తోంది.. ఇక్కడ కనీసం పెద్ద స్థాయి అధికారులు ఎవరు పర్యవేక్షణ లేకపోవడం అలుసుగా తీసుకున్నారు.
** కుంభకోణానికి సంబంధించి నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈవో డి.భ్రమరాంబ చర్యలు చేపట్టారు. అలాగే ఆ ఘటనపై విచారణ జరిపే సమయంలో మరో అవినీతి వ్యవహారం బయటపడింది. స్టాకులో పలు అవకతవకలను గుర్తించిన ఈవో.. మరో నలుగురు ఉద్యోగులకు తాజాగా, మెమోలను జారీచేశారు.


** ఈ వ్యవహారం మొన్న జులై లోనే బయటకు వచ్చింది. అయితే ఎంత మొత్తం అనేది బయటకు రాలేదు. ఆ సమయంలో అంబరు ఖానా గుమస్తాగా పనిచేస్తున్న మద్దాల శ్రీనును దానికి బాధ్యుడిని చేస్తూ విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అలాగే అతడి నుంచి రూ. 5.30 లక్షలు రికవరీ చేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ.. అప్పటి రీజినల్‌ జాయింట్‌ కమిషనర్, ప్రస్తుత శ్రీవారి దేవస్థానం ఈఓ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు.
** దీనిపై అప్పట్లో విచారణ జరిపిన భ్రమరాంబ నివేదికను కమిషనర్‌కు అందజేశారు. అక్రమాలకు పాల్పడిన వారికి షాకిచ్చారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మద్దాల శ్రీనుకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌ చేసి, తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఈవో భ్రమరాంబ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఘటనకు సంబంధించి ఏఈఓను, సూపరింటెండెంట్‌ను, అలాగే మరో గుమస్తాను బాధ్యులను చేస్తూ, వారికి ఒక్కో ఇంక్రిమెంట్‌ను కట్‌చేస్తూ ఆదేశాలిచ్చారు.
** ఇక, నెయ్యి కుంభకోణం ఘటనపై విచారణ జరిపిన సమయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈఓ భ్రమరాంబ విచారణ జరుపుతుండగా, అంబరుఖానాలోని స్టాకులో పలు అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. దీనికి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, ఇద్దరు గుమస్తాలను బాధ్యులను చేస్తూ.. ఏడు రోజుల్లోపు వివరణ కోరుతూ వారికి మెమోలను జారీ చేశారు. అలాగే చైతన్య జ్యోతి వెల్ఫేర్‌ సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఏఈఓకు ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్‌ షాపు లీజు విషయంలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వైకుంఠరావును నియమించారు.

author avatar
Comrade CHE

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!