NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Radha Murder Case: నేరం చేసిన వాడు పోలీసుల నుండి తప్పించుకోలేడు(గా) ..! వివాహిత హత్య కేసులో వీడిన మిస్టరీ

Big Twist In Radhas murder case husband killed her
Share

Radha Murder Case: అనుమానంతో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. ఒక వేళ అదీ కాకపోతే కేసులో ఆ వివాహిత స్నేహితుడు ఇరుక్కుంటాడని భావించాడు. కానీ .. చివరకు పోలీసులకు చిక్కాడు ఆ ప్రబుద్ధుడు. నేరం చేసిన వాడు పోలీసుల నుండి తప్పించుకోలేడు అనేది మరో సారి రుజువు అయ్యింది. వివాహిత రాధ హత్య కేసు మిస్టరీని ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేళ్లపాడు శివారులో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు మిస్టరీ వీడింది. అనూహ్యంగా భర్తే హత్య చేయించనట్లు తేలింది. తొలుత ఆమె చిన్ననాటి స్నేహితుడు పై అనుమానాలు కలిగాయి. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో హత్య చేయించింది భర్తేనని నిర్దారణ అయ్యింది.

Big Twist In Radha's murder case husband killed her
Big Twist In Radha8217s murder case husband killed her

 

సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం (మే 20) సాయంత్రం రాధ అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆమె భర్త మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లాకు విచారణ కోసం తరలించారు. పోలీసుల విచారణలో భార్య రాధను ఎందుకు హత మార్చాడో వివరించాడు మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లేళపాడు కు చెందిన రాధకు 2013 లో నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో వివాహం అయ్యింది. అతను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న తన చిన్న నాటి స్నేహితుడు కాశీరెడ్డికి రాధ తన భర్త మోహన్ రెడ్డి నుండి రూ.16 లక్షలు అప్పుగా ఇప్పించింది. ఆ తర్వాత ఒక కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఆర్ధిక సాయం కావాలంటే మరో రూ.35 లక్షలు ఇప్పించింది. ఆ తర్వాత కాశీరెడ్డి ఆ డబ్బులు ఇవ్వలేదు. ఆర్దిక ఇబ్బందులతో ఇల్లు విడిచి పారిపోయాడు.

అప్పటి నుండి రాధ, మోహన్ రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కనిగిరికి వస్తే అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లిస్తానని కాశిరెడ్డి మెసేజ్ చేయడంతో రాధ ఈ నెల 17న వెళ్లిందనీ, ఆ తర్వాత హత్యకు గురైందని తొలుత భావించారు. కాశీరెడ్డే హత్య చేయించి ఉంటాడని అందరూ భావించారు. రాధ తల్లిదండ్రులు కూడా అదే తరహాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యప్తు చేయగా కాశిరెడ్డి ప్రమేయం లేదని నిర్దారణ అయ్యింది. పామూరు బస్టాండ్ వద్ద రాధా ను తీసుకువెళ్లేందుకు ఆ రోజు వచ్చి కారు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో వాటిని పోలీసులు పరిశీలించారు. ఆ కారు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారు కావడం, దానికి తోడు హత్య తర్వాత మోహన్ రెడ్డి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అతనిపై దృష్టి పెట్టారు. కనిగిరిలో రాధ వెళ్లిన సమయంలో ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన కారులో మోహన్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. అతడిని చూసే ఆమె కారు ఎక్కే విషయంలో షాక్ అయి రెండు అడుగులు వెనక్కు వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాశీరెడ్డి కాకుండా తన భర్త ఎందుకు వచ్చాడన్న అనుమానం అమెకు కలిగి ఉంటుందని బావిస్తున్నారు.

రాధ అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఫోన్ ను పరిశీలన చేయగా అసలు విషయం బయటపడింది. రాధ తన స్నేహితుడు కాశీరెడ్డికి భారీగా డబ్బులు ఇప్పించడం, అతను తిరిగి ఇవ్వకపోవడంతో కోపంతో ఉన్న మోహనరెడ్డికి తన భార్యకు కాశీరెడ్డికి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నట్లు అనుమానించాడు. నిర్దారించుకునేందుకు ఒక కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసి ఆ నెంబర్ కు ట్రూకలర్ లో కాశీరెడడి పేరు వచ్చేలా చేసి ఇటీవల కాశిరెడ్డి పేరుతో మోహన్ రెడ్డి తన భార్య రాధతో వాట్సాప్ ఛాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ ఛాటింగ్ లో రాధ సమాధానాలతో మోహన్ రెడ్డికి అనుమానం మరింత బలపడింది.

రాధను చంపేందుకు పక్కా ప్లాన్ సిద్దం చేసుకున్న మోహన్ రెడ్డి.. కాశీరెడ్డి పేరుతో ఛాటింగ్ చేసి ఒంటరిగా వస్తే డబ్బులు ఇస్తానని మెసేజ్ చేశాడు. నిజంగా కాశీరెడ్డే మెసేజ్ పెట్టాడనుకుని రాధ కనిగిరికి వెళ్లింది. కనిగిరి బస్టాండ్ వద్ద భర్త మోహన్ రెడ్డి కారులో కనిపించడంతో రాధ ఒక్క సారిగా అనుమానం వచ్చింది. కారులో వచ్చింది భర్తే కావడంతో ఆ తర్వాత కారు ఎక్కింది. అక్కడి నుండి ఆమెను కారులో టిడ్కో ఇళ్ల పక్కకు తీసుకువెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత రాత్రి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆమె మృతదేహంపై కారును పదే పదే ఎక్కించి తొక్కించాడు. హత్యకు ముందు ఆమెను మోహన్ రెడ్డి కారులోనే చిత్రహింసలు పెట్టి గాయపర్చినట్లు భావిస్తున్నారు. హత్య తర్వాత తన మామకు ఫోన్ చేసి మీకేమైనా క్లూ దొరికిందా అంటూ ఆరా తీశాడు. తాను వచ్చే వరకూ రాధ ఫోన్ ను ఎవరికీ ఇవ్వొద్దని చెప్పాడు. తొలుత అత్తమామలకు కూడా మోహన్ రెడ్డిపై అనుమానం రాలేదు. అయితే ఇప్పుడు ఈ కేసులో మోహన్ రెడ్డికి సహకరించిన ఇద్దరు వ్యక్తులు ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident: హైదరాబాద్ శివారులో మోర రోడ్డు ప్రమాదం


Share

Related posts

Lock Down: తెలంగాణలో లాక్ డౌన్‌… కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం ఎప్పుడంటే….

sridhar

Thaman: సూపర్ స్టార్ సక్సెస్ థమన్ మీదే ఆధారపడి ఉందా..?

GRK

ఇండియాలోకి అడుగుపెడుతున్న 9 కొత్త బైక్స్.. వివరాలు ఇలా..!

bharani jella