BJP: చంద్రబాబు కావాలా..? జగన్ కావాలా..? ఒక్క మీటింగ్ లో తేల్చిన అమిత్ షా..!!

Share

BJP: ఏపిలో బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతుంటాయి. కాళ్లు మాత్రం గడప కూడా దాటడం లేదు. స్వతహాగా అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష అయితే ఉంది కానీ అందుకు తగ్గ ప్రణాళిక, బలోపేతానికి చర్యలు లేవు. గతంలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహనరావు లు బీజేపీలో చేరిన కొత్తలో ఇక ఏపిలో టీడీపీ ఖాళీ అయిపోతుంది. వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారు. వాళ్లు బీజేపీ చేరితే చంద్రబాబే వాళ్లను బీజేపీకి పంపించారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అదే క్రమంలో జేసి దివాకరరెడ్డి తో సహా పలువురు సీనియర్ నేతలను సైతం బీజేపీ ఆహ్వానించింది. వాళ్లు ఎవరూ బీజేపీకి వెళ్లడానికి సిద్ధం కాలేదు.  ఆ విషయం అలా ఉంచితే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది అంటే అక్కడి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీని విమర్శిస్తూ  ముఖ్యమంత్రి కేసిఆర్ పై దూకుడుగా వెళుతున్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

BJP: Amit shah key suggestions
BJP: Amit shah key suggestions

 

Read More: Sanchaita Gajapati Raju: నా పదవినే ఊడగొడతావా..! చిన్నాన్న మీద సంచయిత అధ్భుత రివేంజ్..?

BJP: పార్టీలో చేరిన నేతలకు కొరవడుతున్న ప్రాధాన్యత..?

కానీ ఏపి విషయానికి వచ్చేసరికి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించే పరిస్థితి ఆ పార్టీ నేతల్లో కనబడటం లేదు. ఏపి బీజేపీలో కొందరు కీలక నేతలు వైసీపీకి అనుకూల వర్గంగా, మరి కొందరు వ్యతిరేక వర్గంగా వ్యవహరిస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. పార్టీ బలపడాలంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తూ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించాలి. కానీ ఏపి బీజేపీలో అది కొరవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ పెద్దగా పోటీ చేసి గెలిచిన పరిస్థితీ లేదు. అమరావతి రాజధాని విషయంలో తొలుత రైతులకు మద్దతు తెలియజేసిన బీజేపీ .. ఆ తరువాత సైలెంట్ అయిపోయింది. మరో విషయం ఏమిటంటే  బీజేపీలో చేరిన నేతలకు సరైన గౌరవం ఇవ్వకపోగా అవమానించే రీతిలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారనీ,
ఆ కారణంగా ఇతర పార్టీల నుండి ఎవరైనా చేరడానికి సిద్దమైనా రాబోయే రోజుల్లో వీరిని అవే మాటలు అంటారని ఉద్దేశంతో చేరికలకు బ్రేక్ పడిందన్న టాక్ వినబడుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపిలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా స్వతహాగా పోటీ చేసి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను గెలిచే పరిస్థితి అయితే బీజేపీకి లేదు అన్నది అందరికీ తెలిసిందే. కానీ అధికార వైసీపీకి ప్రత్యామ్నాయం తామే, 2024 ఎన్నికల్లో బీజేపీదే అధికారం అంటూ ప్రకటనలు ఇస్తూ ధీమా వ్యక్తం చేస్తుంది ఏపి బీజేపి.

తెలంగాణలో మాదిరి దూకుడుగా వ్యవహరించాలి

ఇటీవల సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు తిరుపతి విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ నేతలతోనూ పార్టీ పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఇదే క్రమంలో పార్టీ బలోపేతానికి  ఏపీ బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేశారుట. ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉందనీ, తెలంగాణలో మాదిరిగా పార్టీ దూకుడుగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీకి ఏపిలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు ప్రత్యర్ధి పార్టీలేనని అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ శ్రేణులు పోరాటాలు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అమరావతి రైతుల పాదయాత్రలో పార్టీ నేతలు పాల్గొని సంఘీభావం తెలియజేయకపోవడాన్ని ప్రశ్నించారని సమాచారం. పలు విషయాల్లో అమిత్ షా సున్నితంగా నేతలకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమిత్ షా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎటువంటి స్ట్రాటజీ అమలు చేస్తారో వేచి చూడాలి.


Share

Related posts

Congress: పీకే వ్యూహాలు పదునెక్కకముందే…కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు ఇస్తున్న ఒక్కరొక్కరు..

somaraju sharma

KCR : కేసీఆర్ కు బీపీ పెంచేస్తున్న ముఖ్య నేత‌లు.. .ఒక‌రి త‌ర్వాత ఒక‌రు…

sridhar

శివసేన ఇంకా ప్రభుత్వంలో ఎందుకు?

Siva Prasad