ఏపీ, తెలంగాణలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ఇవేళ ప్రకటించింది. ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప – అనంతపురం – కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం స్థానానికి పీవీఎస్ మాధవ్ ను బీజేపీ ఎంపిక చేసింది. తెలంగాణలోని హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపిలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, 9 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 14), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Breaking: బీబీసీపై ఐటి గురి..బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల దాడులు