BJP: ఏపి బీజేపీపై అధిష్టానం సవతి తల్లి ప్రేమ..! ఇదిగో మూడవ ఫ్రూఫ్..!!

Share

BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీపై కేంద్ర నాయకత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ, జాతీయ యువమోర్చా కార్యవర్గం నియామకంలో ఇప్పుడు తాజాగా  బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం చూస్తుంటే ఏపి బీజేపీపై కేంద్ర నాయకత్వం చిన్న చూపు చూస్తోంది అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల బీజేపీ, భాగస్వామ్య పక్షాల నేతలకు అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి పదవి లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఏపి మాత్రమే.

BJP central committee
BJP central committee

పార్టీ విధేయులకు పెద్ద పీట

ఆ తరువాత యువమోర్చా జాతీయ కార్యవర్గంలోనూ ఏపికి కేంద్ర బీజేపీ మొండి చేయి ఇచ్చింది. పొరుగు రాష్ట్రం తెలంగాణకు యువమోర్చాలో రెండు కీలక పదవులు ఇచ్చిన కేంద్ర బీజేపీ ఏపికి చెందిన ఒక్క నాయకుడుకి చోటు కల్పించలేదు. అలా రెండు సార్లు ఏపి బీజేపీకి అన్యాయం జరిగిన విషయం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర బీజేపీ 80 మందితో జంబో టీమ్ ఏర్పాటు చేసింది. జాతీయ కార్యవర్గంలో పార్టీ విధేయులకు పెద్ద పీట వేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటి సీఎంలు, సీఎల్పీ నేతలు, మాజీ సీఎంలు, జాతీయ స్థాయి పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, రాష్ట్రాల అధ్యక్షులతో 50 మంది ప్రత్యేక అహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులను ప్రకటించింది.

BJP: జాతీయ కార్యవర్గంలో ఒక్కరికే ఛాన్స్

తాజాగా ప్రకటించిన 80 మంది సభ్యుల జాబితాలో ప్రధాన మంత్రి మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ నేతలు ఎల్ కే అధ్వానీ, మురళీ మనోహర్ జోషికి స్థానేం కల్పించారు. యూపీ నుండి అత్యధికంగా 12 మంది సభ్యులుగా, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కాగా తెలంగాణ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్, గరికపాటి రామ్మోహన రావును సభ్యులుగా నియమించారు. ఏ పి నుండి బీ జే పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరికే చోటు దక్కింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఏపి బీజేపీ నేతలు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేయడంలో విఫలం అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Share

Related posts

వరలక్ష్మీ శరత్‌కుమార్ కి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మించిన అవకాశాలు..!

GRK

బ్రేకింగ్: కడప యురేనియం కర్మాగారంలో అగ్నిప్రమాదం

somaraju sharma

Today Horoscope ఫిబ్రవరి 12 శుక్రవారం.. ఈ రాశి వారు అప్పుల బాధలు తీర్చుకొని ధన ప్రాప్తి పొందుతారు

Sree matha