NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court : ఎస్ఈసీకి బీజేపీ షాక్..! నోటిపికేషన్ విడుదల చేసిన 24గంటల్లోపే కొత్త ట్విస్ట్..!!

AP High Court : ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్ ఐఎఎస్ అధికారిణి నీలం సాహ్ని ఎంపీటీసీ, జడ్‌పీటీసి ఎన్నికలకు నోటిపికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ పోలింగ్, 10వ తేదీ ఫలితాలు వెల్లడి అంటూ షెడ్యూల్ ప్రకటించేశారు. ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అంతా బాగానే జరిగిపోతుంది, వారం రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది అనుకుంటున్న తరుణంలో బీజేపీ షాక్ ఇచ్చింది.

BJP filed petition AP High Court
BJP filed petition AP High Court

ఎస్ఈసీ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మరో ముగ్గురు కూడా ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఎస్ఈసీని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే పరిషత్ ఎన్నికలపై జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. రేపు దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఆ తీర్పు, ఇప్పుడు కొత్తగా బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరో పక్క నేడు ఎస్ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని టీడీపీ, జనసేన, సిపిఐతో పాటు బీజేపీ బహిష్కరించాయి. టీడీపీ ఎన్నికలను బహిష్కరించాలనే కీలక నిర్ణయం తీసుకోనున్నదని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పరిషత్ ఎన్నికలపై చర్చ జరిగినట్లు తెలుస్తొంది. బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటాయా లేదా అనేది ఇంక స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు న్యాయపోరాటం చేస్తున్నాయి. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే నీలం సాహ్ని హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితిని బీజేపీ తీసుకువచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?