BJP Janasena CM Candidate War in Ap
BJP Janasena CM Candidate War: “ఆలు లేదు.. సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం” అన్న సామెత మాదిరాగా ఏపిలో బీజేపీ – జనసేన పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీల వాస్తవిక బలంతో అధికారంలోకి వస్తాయి అనుకుంటే పగటి కలే అనుకోవాల్సి ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు ఏపిలో జనసేన – బీజేపీ మధ్య సీఎం అభ్యర్ధి అంశం పై చర్చ హాట్ హాట్ గా నడుస్తొంది. ఇంతకు ముందు తిరుపతి ఉప ఎన్నికల సమయంలో బీజేపీ – జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ కళ్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదేపదే చెప్పారు. అయితే బీజేపీ అధిష్టానం నుండి దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో ఆ తరువాత అంశం మరుగున పడింది.
Read more: JP Nadda: ఏపికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా..పొత్తులపై క్లారిటీ ఇచ్చేస్తారా..?
ఇప్పుడు ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్నట్లుగా అన్ని రాజకీయ పక్షాలు జనాల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బాదుడు బాదుడు అంటూ జనాల్లోకి వెళుతుండగా, వైసీపీ కూడా ఇంటింటికి మన ప్రభుత్వం అన్న పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఇటీవల సామాజిక న్యాయ భేరి సభలను నిర్వహించింది. అధికార పార్టీ కూడా జనాల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సిద్దపడుతున్నారు అన్న వాదనలకు బలం చేకూరుతోంది. బీజేపీ, జనసేన కూడా విస్తృత సమావేశాలు, కార్యక్రమాలు చేపడుతోంది. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు. మరో పక్క సమావేశాలను నిర్వహిస్తున్నారు. అదే విధంగా బీజేపీ నేతలు చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలకు సంబంధించి జనసేన ముందు ఉన్న మూడు ఆప్షన్స్ ఆ పార్టీ శ్రేణులకు వివరించారు. జనసేన – బీజేపీ పొత్తుతో ఎన్నికల్లో వెళ్లడం, లేదా జనసేన – బీజేపీ కూటమి టీడీపీతో కలిసి అధికార పక్షాన్ని ఎదుర్కొవడం, మూడో ఆప్షన్ గా జనసేన ఒంటరిగా పోటీ చేయడం అని చెప్పారు. ఇప్పటి వరకూ చాలా సార్లు మనం తగ్గాం ఇక తగ్గేది లేదు అని అన్నారు. జనసేన – బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా తనను ప్రకటిస్తున్నట్లుగా బీజేపీ అధిష్టానం నుండి సమాచారం ఏమి లేదని చెప్పారు. ఇలా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ .. ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ అధిష్టానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ బీజేపీ సమావేశాల్లో పాల్గొంటున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మరో జనసేన నేత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీలో సీఎం అభ్యర్ధి స్థాయి నేత ఎవరూ లేరని పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు. తమ పార్టీలో చాలా మంది సీఎం అభ్యర్ధులు ఉన్నారని, జనసేన ఇచ్చే అల్టిమేటాలకు బీజేపీ భయపడదని అన్నారు రమేష్ నాయుడు. జేపి నడ్డా పర్యటనలోనూ సీఎం అభ్యర్ధి ప్రకటన ప్రస్తావన ఉండదని రమేష్ నాయుడుతో పాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు కూడా పేర్కొన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని జీవీఎల్ పేర్కొన్నారు. అసలు బీజేపీ విధానం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలకు ముందుగా సీఎం అభ్యర్ధిని ప్రకటించరు. ఎన్నికల అనంతరమే పార్టీ పరిశీలకుల ఆధ్వర్యంలో ఎల్పీ సమావేశం నిర్వహించి సీఎం అభ్యర్ధిని ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఏపిలోనూ బీజేపీ ముందుగా సీఎం అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉండదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా కూడా ఈ విషయంలో నాన్పుడు ధోరణినే ప్రదర్శించవచ్చు.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…