NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ చేతుల్లో బీజేపీ తాళం..! త్వరలో ఢిల్లీ పెద్దలతో జనసేనాని భేటీ..?

Pawan Kalyan: దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో ఇప్పుడు బీజేపీ మంచి జోష్ తో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది. దేశం మొత్తం మీద ఉన్న 29 రాష్ట్రాలకు గానూ 19 రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయి. మిగిలిన 9 రాష్ట్రాల్లో కూడా వాళ్ల మాటలు వినే సీఎంలే అయిదు రాష్ట్రాల్లో ఉన్నారు. కేవలం నలుగురు అయిదుగురు సీఎంలు మాత్రమే బీజేపికి వ్యతిరేకంగా గళం విప్పేవారు ఉన్నారు. అందులో మమతా బెనర్జీ, కేసిఆర్, ఉద్దవ్ ఠాకరే, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. వీళ్లు నలుగురు మాత్రమే బీజేపికి వ్యతిరేకంగా కాస్త సీరియస్ గళం విప్పుతున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపి సీఎం వైఎస్ జగన్ కానీ కేరళ సీఎం సైతం బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పడం లేదు. తమిళనాడు సీఎం స్టాలిన్ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడవచ్చు కానీ ఇంకా ఆయన మొదలు పెట్టలేదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు నలుగురు మాత్రమే ఉన్నారు. మరో నలుగురు వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తానికి 19 రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలే అధికారంలో ఉన్నాయి. సో..ఇప్పుడు బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలి. తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం కావాలి అన్నది వారి లక్ష్యం. బీజేపీ – జనసేన రెండవ స్థానంలో ఉండాలి. అందుకు పవన్ కళ్యాణ్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి రాజకీయాలు చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది. అంటే బీజేపీ తాళాలు అన్నీ పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటాయి.

BJP key in Pawan Kalyan hands
BJP key in Pawan Kalyan hands

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ద్వారా ఏపిలో బీజేపీ రాజకీయాలు

అభ్యర్ధుల ఎంపిక నుండి రాబోయే రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనే బీజేపీ – జనసేన ఉమ్మడిగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు కేంద్రం నుండి అవసరమైన సహకారాలు అందించేలా వ్యూహాన్ని ప్రెపేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి రాజకీయాలు చేయడానికి బీజేపీ నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయం పవన్ మాటల్లోనే తెలిసిపోయింది. నిన్న జనసేన తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేదికపై పవన్ కళ్యాణ్ చెప్పేశారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిందనీ, దాని కోసం వెయిట్ చేస్తున్నానని పేర్కొన్నారు. నెలా రెండు నెలల్లో దీనిపై ఒక ప్రణాళిక ఖరారు అయిన తరువాత పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిపించుకుని అక్కడే ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది వర్క్ అవుట్ అవుతుందా.. ? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం గానీ ప్రతిపక్ష హోదా నిజంగా సాధ్యం అయ్యేనా.. ? అంటే అది సాధ్యం కాదు. ఇది అందరికీ తెలుసు. అది బీజేపీకి తెలియదు. ఒక వేళ తెలిసినా అంగీకరించదు. ఎందుకంటే వాళ్ల చేతిలో అధికారం ఉంది. వ్యవస్థలు ఉన్నాయి. బలం ఉంది. అందుకే “యూపి టు ఏపి” అన్న నినాదం తీసుకుంటున్నారు. యూపి అధికారంలోకి వచ్చాము కాబట్టి నెక్ట్స్ ఏపిలోనూ అధికారంలోకి రావాలి. అందుకు చరిష్మా గల నాయకుడు కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ చేతిలో మా తాళాలు పెడతాం. ఆయనకు అనుకూలమైన సీట్లలో ఆయన పోటీ చేస్తారు. మాకు అనుకూలమైన సీట్లలో మేము పోటీ చేస్తాం. మా వాళ్లు వాళ్లకు. వాళ్ల వాళ్లు మాకు సహకరిస్తారు అన్న లెక్కలో బీజేపీ ఉంది.

Pawan Kalyan: బీజేపీ ఎదగాలంటే ఏపికి కేంద్రం ఏదో ఒక మంచి పని చేయాలి

అది సాధ్యమా..? వాస్తవానికి బీజేపీకి ఓట్లు.. సీట్లు లేవు..! ఈ రెండు పార్టీలు కలుపుకున్నా సరే రాష్ట్రంలో ఏడు శాతం మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది. జనసేనకు బలం పెరిగింది అనుకుంటే పది శాతం వరకూ వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే జనాలకు పీకల దాకా కోపం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని బీజేపీ ఏమీ చేయలేదు. యూపిలో బీజేపీ గెలిచింది అంటే అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. బీహార్ లో గెలిచింది అంటే అక్కడ వేరు. తెలంగాణలో గెలుస్తుంది అంటే అక్కడ పరిస్థితులు వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గెలవాలి, ఆ సింబల్ కు ఓట్లు వేయాలి అంటే ఏపికి కేంద్రం ఏదో ఒక మంచి పని చేయాలి కదా !. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వవచ్చు కదా..! లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో ఆపేస్తామని చెప్పవచ్చు కదా..! రాష్ట్రానికి ప్రత్యేక హోదా పరిశీలిస్తామని, ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వవచ్చు కదా..! ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అన్నదానికి సహేతుకమైన కారణం చెప్పడం లేదు. ప్రత్యేక హోదా ఎలానూ ఇవ్వడం లేదు.

 

గందరగోళంలో జనసేన ..క్లారిటీతో బీజేపీ

ప్యాకేజీ రూపంలో రైల్వే లైన్ లు, కొత్త కొత్త జాతీయ ప్రాజెక్టులు అయినా ఇచ్చేయవచ్చు కదా..! ఏదీ ఇవ్వడం లేదు. పైగా ఇక్కడ ఉన్న వాటిని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న తీర ప్రాంతాలు అన్నీ వారికి అనుకూలమైన వ్యక్తులకు ధారాదత్తం అయిపోతున్నాయి. ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ వారికి అనుకూలమైన వారికి ప్రైవేటుపరం అయిపోతోంది. అలాంటి బీజేపీకి ఇక్కడ ఓట్లు ఎందుకు వేస్తారు. పవన్ కళ్యాణ్ కు బీజేపి తప్పదు. వైసీపీ ఎదుర్కొవాలంటే బీజేపీ లాంటి శక్తి అవసరం. అందుకే జనసేన బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది. అందుకే జనసేన ఇప్పుడప్పుడే బీజేపీని వదిలి బయటకు రావడానికి సిద్ధంగా లేదు. బీజేపీతో కొనసాగితే రాబోయే కాలంలో జనసేనకు నష్టం జరుగుతుందని మాత్రం ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీతో కలిసి ప్రయాణిస్తేనే వైసీపీకి అధికారాన్ని దూరం చేయవచ్చని జనసేన లో కొందరు భావిస్తున్నారు. అందుకే జనసేనలో ఒక గందరగోళం ఉండగా, బీజేపీ ఒక క్లారిటీతో ఉంది.  ఏమి జరుగుతుందో చూడాలి మరి.

author avatar
Srinivas Manem

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju