YS Jagan: జ‌గ‌న్ హర్ట‌య్యే మాట మాట్లాడిన బీజేపీ పెద్దాయ‌న‌

YS Jagan: Key Decision by ap cm
Share

YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని సంద‌ర్భానుసారం బీజేపీ నేత‌లు టార్గెట్ చేస్తుండే సంగతి తెలిసిందే. తాజాగా క‌రోనా కేంద్రంగా ఏపీ సీఎంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏపీ సర్కార్ పై బీజేపీ సీనియ‌ర్‌ జీవీఎల్ నరసింహారావు తాజా ఫైర్ అయ్యారు. అటు ఏపీ సీఎం ప‌రిపాల‌న‌ను , ఇటు ఏపీలో క‌రోనా ప‌రిస్థితిని ఉద‌హ‌రిస్తూ ఆయ‌న విరుచుకుప‌డ్డారు. నవరత్నాల పేరుతో గొప్పలు చెప్పుకునే వైఎస్ జ‌గ‌న్‌ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని జీవీఎల్ ఆరోపించారు.

ఏపీలో ఏంటిది?

క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌డంలో ఏపీ తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ విరుచుకుప‌డ్డారు. క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఏపీ 5వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో ఉందని తెలిపిన ఎంపీ జీవీఎల్ ఇంత దారుణమైన‌ పరిస్థితి ఏపీలో ఎందుకు నెలకొందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యాక్సినేషన్ విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని పేర్కొన్న‌ ఎంపీ జీవీఎల్ అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా ఉపయోగించడం లేదని విమ‌ర్శించారు. ఏపీలో సరైన సంఖ్యలో టెస్టులు లేవని ఎంపీ జీవీఎల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో అధ్వాన పరిస్థితి ఉందని ఆయ‌న మండిప‌డ్డారు. గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైద్య మౌలిక వసతులను ఎందుకు మెరుగుపర్చలేకపోయింది అంటూ ఎంపీ జీఎల్ విరుచుకుప‌డ్డారు.

జ‌గ‌న్ హ‌ర్ట‌య్యేలా….

క‌రోనా క‌ట్ట‌డికి సంబంధించి మాస్కు ధరించడం వంటి కోవిడ్ బిహేవియర్ విష‌యంలో రాష్ట్ర సీఎం, మంత్రులు ఎవరూ పాటించడం లేదని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. సీఎం స‌హా మంత్రులు “కోవిడ్” భయం లేదా? లేక “కోవిడ్” వైసీపీకి ఏమైనా ప్రత్యేక మినహాయింపు ఇచ్చిందా? అని కామెంట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే సందేశం ఏంటని బీజేపీ ఎంపీ ప్ర‌శ్నించారు


Share

Related posts

కర్నూలుకు జమ్మూ మాజీ సీఎం

sarath

మంచి స్పీడ్ మీద ఉన్న పవన్ కళ్యాణ్..!!

sekhar

కరోనా టాబ్లెట్ వచ్చేసింది కదా అని వేసుకుందాం అనుకుంటున్నారా..ఆగండి ఇది చదవండి

somaraju sharma