Badwel By Poll: బద్వేల్ బై పోల్ ..! 28 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్..?

Share

Badwel By Poll: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ నిన్న ముగిసింది. 68.12 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే పోలింగ్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు పోలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ..ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పించారు. శనివారం పోలింగ్ సరళని చూస్తే 55 శాతం కూడా మించకూడదనీ కానీ దొంగ ఓట్లు వేసుకున్నారనీ, కాబట్టే ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ఎక్కువ మంది ఇన్ చార్జిలను పెట్టుకున్నారని అన్నారు. మండలాల వారీగా ఇన్ చార్జిలు గా ఉన్న వైసీపీ నాయకులు బీజేపీ ఏజెంట్ లను ఎందుకు బెదిరించారని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికలను తలపించారని సోము విమర్శించారు.

bjp leaders complaints to ec on Badwel By Poll
bjp leaders complaints to ec on Badwel By Poll

బద్వేల్ ఉప ఎన్నికల్లో అడుగడుగునా దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయని సోము వీర్రాజు అన్నారు. దొంగ ఓటర్లు బారులు తీరారని ఆరోపించారు. సిద్దపటం, కడప, పొద్దుటూరు నుండి స్థానికేతరులను ప్రత్యేక వాహనాల్లో తరలించారని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. మొత్తం 28 కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మాదిరిగా దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే వాళ్లు బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఫైర్ అయ్యారు. బద్వేల్ లో జరిగింది బై పోల్ కాదనీ బస్ పోల్ అని సోము సెటైర్ వేశారు. వైసీపీ నాయకులు సాగిస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ చాలా నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ను రాబోయే రోజుల్లో తప్పక చూపిస్తారనీ, వైసీపీని గద్దె దించుతారని సోము అన్నారు.

బీజేపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు సైతం బద్వేల్ బైపోల్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు. ఓటర్లను అద్దెకు తెచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆయన ఆరోపించారు. బద్వేల్ లో అధికార దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. 28 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.అయితే తొలుత బీజేపీ ఆరోపణలను సీఇఓ కొట్టిపారేశారు. తమకు ఫిర్యాదులు రాలేదని వెల్లడించారు. అనంతరం బీజేపి ఈసీకి ఫిర్యాదులు చేసింది. ఈ ఫిర్యాదులపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.


Share

Related posts

A.M. Ratnam: కొడుకు రీ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లానింగ్ వేసిన ఏఎమ్ రత్నం..??

sekhar

జ‌గ‌న్ స‌ర్కారుపై చిన్న‌మ్మ క‌న్నెర్ర‌….

sridhar

మండలి రద్దుతో ఇద్దర్ని రాజ్యసభకు పంపుతున్న వైసీపీ

Siva Prasad