NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీడీపీనీ చంపేసి.. జనసేననీ తొక్కేసి..! బీజేపీ ఫైనల్ ప్లాన్ ఇదేనా!?

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న మోడీ, షా ధ్వయం చేస్తున్న రాజకీయాలు గతానికి భిన్నంగా ఉంటాయి. ఉంటున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి వారికి ఓట్లు, సీట్లతో పని లేదు. అధికారంలోకి రావడానికి అనైతిక మార్గాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలు సాధించకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఉదంతాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడకుండా చేయడంతో పాటు ఆ పార్టీకి మద్దతుగా నిలిచే ప్రాంతీయ పార్టీలను ఏదో విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తూ విజయం సాధిస్తొంది బీజేపీ. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన పునాదులు వేసుకున్న బీజేపీ ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలపడేందుకు వ్యూహాత్మక ఆడుగులు వేస్తొంది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాలపైనా దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రతి ఎన్నికనూ ప్రతిష్టాత్మంగా తీసుకుంటోంది. ఇతర పార్టీలోని బలమైన నాయకులు చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ యే అన్న సంకేతాలు ఇస్తొంది.

బీజేపీ: ఫస్ట్ స్టెప్ గా నలుగురు రాజ్యసభ సభ్యులు

ఇక ఏపి విషయానికి వస్తే తెలుగు దేశం పార్టీని దెబ్బతీస్తే ఆ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లుతుందనీ, తద్వారా రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ (రెండవ స్థానం) ఆక్రమించుకోవచ్చని భావించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకోవడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున బీజేపీలోకి టీడీపీ నుండి చేరికలు ఉంటాయని భావించారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రమే బీజేపీలో చేరారు. ఈ మూడేళ్లలో టీడీపీ చాలా బలహీనమవుతుందని బీజేపీ పెద్దలు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి అధికారం దగ్గకుండా చేస్తే ఆ పార్టీలోని నేతల్లో చాలా మంది గత్యంతరం లేక బీజేపీ పంచన చేరే పరిస్థితులు వస్తాయి. తద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ఆలోచన బీజేపీ చేస్తున్నదని వార్తలు వినబడుతున్నాయి.

Modi amit shah file photo

బీజేపీ: జనసేన చేజారకుండా చేస్తే..

అందుకే తమతో పొత్తులో ఉన్న జనసేనతోనే ఎన్నికల్లోకి వెళతామని బీజేపీ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. మరో సారి బీజేపీతో జత కట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహహస్తం అందిస్తున్నా బీజేపీ ససేమిరా అంటోంది. ఆ పార్టీ నేతలు పలువురు బహిరంగంగానే మరో సారి టీడీపీని నమ్మే పరిస్థితి లేదనీ, టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తిలేదని ప్రకటించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్ర పక్షంగానే వ్యవహరిస్తొంది. అటు తమిళనాడులో స్టాలిన్, ఇటు తెలంగాణలో కేసిఆర్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మాదిరిగా కేంద్రంతో కాలు దువ్వడం లేదు. వ్యతిరేకంగా వ్యవహరించడం లేదు.

 

రీసెంట్ గా విశాఖకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విచ్చేసిన సందర్భంలో సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కంటే మిన్నగా వైసీపీ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. సో..40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు మరో సారి అవకాశం ఇస్తే మళ్లీ జాతీయ స్థాయి రాజకీయాలు అంటూ ఏకు మేకయ్యే ప్రమాదం ఉందని భావించే టీడీపీతో గ్యాప్ అంతే కొనసాగిస్తొందన్న వాదన లేకపోలేదు. అందుకే కాబోలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరినా బీజేపీ పెద్దలు ఇంత వరకూ సానుకూలంగా స్పందించలేదు. రాబోయే రోజుల్లో ఏపిలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.

G20 Summit: జీ 20 సమ్మిట్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పయనం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!