BJP MP GVL: సీఎం జగన్‌తో పాటు బాబును జీవిఎల్ ఇరికించేశాడుగా..! దటీజ్ జీవిఎల్..!!

Share

BJP MP GVL: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు గానీ ఇతరత్రా నిధులను గానీ వారి ప్రాధాన్యత అవసరాలకు మళ్లించి ఖర్చు చేయడం సహజంగా వస్తున్న తంతే. ఇది పెద్ద నేరమూ కాదు, ఘోరమూ కాదు. అవినీతి అంతకన్నా కాదు. కాకపోతే నిబంధనల ప్రకారం జరగని జమా ఖర్చులను కాగ్ తప్పుబట్టడం (అబ్జెక్షన రేజ్ చేయడం), ఆ తరువాత ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇచ్చే సదరు అబ్జెక్షన్‌లను డ్రాప్  చేయడం జరుగుతుంటుంది. గతంలో ఎప్పుడూ జరగనట్లు, ఇప్పుడే జగన్ సర్కార్ లో నిధులు మళ్లింపు జరిపినట్లు కనుగొన్న టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ అంశాన్ని బూతద్దంలో చూపి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు  దానిపైన గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో ఇది పెద్ద వివాదాస్పద అంశం అయిపోయింది. అయితే ఈ విషయంలో లేట్ (ఆలస్యం)గా స్పందించినా లేటెస్ట్ వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు.

BJP MP GVL wrote letter to ap governor on cag objections
BJP MP GVL wrote letter to ap governor on cag objections

రాష్ట్ర బీజేపీలోని కొందరు నేతలకు మొదటి నుండి ఓ అలవాటు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ను విమర్శించాల్సి వస్తే పనిలో పనిగా గత చంద్రబాబు సర్కార్ ను కలిపి విమర్శించడం అనవాయితీ. ఒక్క జగన్ సర్కార్ ను విమర్శిస్తే బాగుండదనీ పనిలో పనిగా  చంద్రబాబు హయాంలో జరిగిన వాటిని ఉటంకించి మరీ విమర్శలు చేస్తుంటారు. అదే మాదిరిగా ఇప్పుడు జీవిఎల్ నర్శింహరావు ఈ ఆర్థిక అంశాలను ప్రస్థావిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఓ లేఖ రాశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయనీ, రూ.41వేల కోట్ల ను వైసీపీ ప్రభుత్వం పారదర్శకత లేకుండా వ్యక్తిగత జమా ఖాతాల్లో జమ చేసి ఖర్చు చేసిందని కాగ్ తన తాజా నివేదికలో పేర్కొంది అన్న జీవిఎల్ నర్శింహరావు గత ప్రభుత్వ హయాంలోనూ ఇటువంటి ఆరోపణలు వచ్చాయన్నారు.

Read More: AP CMO: ఏపి సీఎంఒలో కీలక పరిణామాలు..ముత్యాలరాజు ఇన్..! ప్రవీణ్ ప్రకాష్ అవుట్..!!

53వేల కోట్లకు పైగా వ్యక్తిగత జమ ఖాతాల నుండి నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయబడ్డాయని 2016-17లో కాగ్ నివేదికలో పేర్కొనడం జరిగిందన్నారు. ఆ నివేదక ఆధారంగా తాను అప్పటి గవర్నర్ నరసింహన్ కు లేఖ రాసి విచారణ కోరడం జరిగిందని తెలిపారు. ఆ లేఖ ప్రతిని, అప్పటి కాగ్ నివేదికతో జీవిఎల్ జత చేసి ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. గత ప్రభుత్వ హయాంలో 53వేల కోట్లు, ఈ ప్రభుత్వ హయాంలో మరో 41 వేల కోట్లు మొత్తం దాదాపు లక్ష కోట్లు రెండు ప్రభుత్వాల హయాంలో పీడీ ఖాతాల ద్వారా ఎటువంటి పారదర్శకత లేకుండా ఖర్చు చేయబడ్డాయని కాగ్ నివేదికలు తెలియజేశాయన్నారు. “ఇవి పీడీ ఖాతాలా లేక దోపిడీ ఖాతాలా” అన్న తీవ్ర ఆందోళన ప్రజల్లో నెలకొన్న కారణంగా రెండు ప్రభుత్వాల హయాంలో ఖర్చు పెట్టిన లక్ష కోట్ల వ్యవహారాన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఉందని జీవీఎల్ పేర్కొన్నారు.  ఆర్థిక నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న పీడీ ఖాతాలపై వచ్చిన అభియోగాలపై ఉన్నత స్థాయి విస్తృత విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, కాగ్ ఆధ్వర్యంలో పీడీ ఖాతాల ప్రత్యేక ఆడిట్ ను, అదనంగా సీబీఐ విచారణ ను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను రాజ్యసభ సభ్యుడీ జీవీఎల్ కోరారు.


Share

Related posts

ఈటీవీ ఢీ షో : బాబా భాస్కర్ – పూర్ణ ల దెబ్బకి హీట్ ఎక్కిపోయిన టీవీ సెట్ లు !

sekhar

న్యూ ఆఫ్రిలియా స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసిందోచ్

bharani jella

Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న దిల్ రాజు కోరిక ఎన్నేళ్ళదో తెలుసా..?

GRK