NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

BJP : చెప్పుతో కొట్టడంలో కొత్త ట్విస్ట్!!

BJP : తెలుగుదేశం అనుకూల మీడియా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ లో కావాలనే బిజెపి నాయకుల్ని అవమానిస్తున్నారా? వారి రాతలు, చర్చలు దారి తప్పుతున్నాయా, దారితప్పిస్తున్నారా?? బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీద, అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు శ్రీనివాస్ ఏబీఎన్ స్టూడియోలో చర్చ సందర్భంగా చెప్పుతో దాడి చేయడం తాజాగా సంచలనం అయ్యింది. అయితే దీని వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుకూల మీడియా కుట్ర ఉందన్న ఆరోపణలు ఇప్పుడు అంతర్గతంగా బీజేపీ సర్కిళ్లలో బలంగా వ్యాపిస్తున్నాయి. అందులోనూ టిడిపి సోషల్ మీడియాలో, ఈ సంఘటనను ఎత్తిచూపుతూ బిజెపి నాయకుల మీద ఇష్టానుసారం ట్రోల్స్, మిమ్స్ చేస్తూ ఆనందం పొందుతున్న విషయాన్నీ బిజెపి నాయకులు గుర్తు చేస్తున్నారు.

BJP : యూట్యూబ్ లో ఎందుకు పెట్టారు?

ఒక టీవీ కార్యక్రమానికి చర్చ సందర్భంగా ఇద్దరు అతిథుల మధ్య వాదులాట అనేది సహజం. అందులోనూ రాజకీయ చర్చలు పార్టీలకు సంబంధించిన చర్చలు అయితే ఖచ్చితంగా అది మరింత హీట్ పుట్టిస్తోంది. టి ఆర్ పి ఎల్ కోసం చూస్తూ చర్చలను కావాలనే మసాలా దట్టించిన అనే కోణంలో యాంకర్లు, సీనియర్ జర్నలిస్టు అని చెప్పుకునే న్యూస్ ప్రెజెంటర్స్ కావాలనే అతి చేస్తారు. చర్చను నడిపించడం మాట అటుంచి, ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగితే వారిని సరిదిద్దాల్సిఅంది పోయి మరింత రెచ్చగొట్టేలా చేయడం తెలుగు మీడియాలో ఫ్యాషన్గా మారింది. మంగళవారం ఏబీఎన్ లో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అమరావతి పరిరక్షణ సమితి నేత శ్రీనివాసులు పరస్పరం అమరావతి ఇష్యూ మీద వాదుల ఆడుకుంటూ చర్చ గతి తప్పి విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పుతో దాడి చేయడం ఖండించాల్సిన విషయమే. దీనికి సదరు న్యూస్ ప్రెజెంటర్స్ వెంకట కృష్ణ సైతం క్షమాపణలు చెప్పి, సదరు అమరావతి పరిరక్షణ సమితి నేత శ్రీనివాసులు మరెప్పుడూ స్టూడియోకి పిలవమని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి బీజేపీ నేత మీద చెప్పుతో దాడి చేసిన విషయాన్ని ఎందుకు బహిర్గతం చేశారు? ఎందుకు యూట్యూబ్లోనూ ఇతర సామాజిక మాధ్యమాల్లో నూ పెట్టి కావాలనే రచ్చ చేశారు అన్నది ఏబీఎన్ సమాధానం చెప్పాలి.
** సాటిలైట్ చానల్ కు సోషల్ మీడియా విభాగాన్ని ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ తదితర అకౌంట్లను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రతి విభాగం మీద ఒక మేనేజర్ పని చేస్తారు. దానికి ఒక ప్రత్యేకమైన టీం ఉంటుంది. మరి ఏబీఎన్ లో జరిగిన చర్చ గతి తప్పిన పుడు సదరు వీడియోను సోషల్ మీడియా వేదికగా ఎందుకు విశ్వ వ్యాప్తం చేసి ఏబీఎన్ ప్రచారం చేసింది అన్న దానిని లోనే అసలు మ్యాటర్ ఉంది.

BJP
BJP

కావాలనే కుట్ర..??

అమరావతి ఉద్యమం మీద టీడీపీ అనుకూల మీడియా కు సానుకూల ధోరణి ఉంటే, దానిపై కనీసం కేంద్రాన్ని నిలదీయకుండా గమ్మున ఉంటున్న రాష్ట్ర బిజెపి నాయకుల మీద టిడిపి నేతలకు పీకల వరకు కోపం ఉంది. ముఖ్యంగా టీడీపీ కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో వేగంగా ఎదగాలని భావిస్తున్న బిజెపి ఎత్తులు పై ఎత్తుల మీద, కేంద్ర నాయకత్వం తీరు మీద టీడీపీ శ్రేణులకు పట్టరాని ఉక్రోషం కూడా ఉంది. జగన్ ప్రభుత్వాన్ని బిజెపి నాయకులు ఏమీ అనరని, టీడీపీ ను నాశనం చేయడానికి మాత్రమే టిడిపి నేతలు ఉత్సాహం చూపుతున్నారు అన్న ద్వేషం ఉంది. ముఖ్యంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వైసిపి కు అనుకూలంగా పనిచేస్తున్నారు అన్న భావన రాష్ట్ర బీజేపీ నేతల కంటే టిడిపి నేతలకు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏబీఎన్ లో విష్ణువర్ధన్ రెడ్డి మీద జరిగిన దాడి విషయంలో వైయస్సార్సీపి కంటే టీడీపీ సోషల్ మీడియా విభాగం ఎక్కువ స్పందించడంతో పాటు, దాడి మీద వెటకారపు ప్రచారం చేయడం చూస్తుంటే టీడీపీ అనుకూల మీడియా కావాలని బిజెపి నాయకుల మీద ఓ ప్రణాళిక ప్రకారం దాడి చేయించిందా అన్న అనుమానం కలగక మానదు.
** పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన ఏబీఎన్ ఛానల్ దానిని ఈ విషయంలో పూర్తిగా గాలికొదిలేసింది. ఈ ఆర్ పీ ల గురించి పాకులాడం అని చెబుతూనే, దాడిని మొత్తం యూట్యూబ్ సోషల్ మీడియా లో పెట్టి నానా యాగీ చేసి ప్రచారం పొందాలని భావించడం కూడా నైతికథ కాదు. దీని వెనుక ఉన్న నిజాలను బిజెపి నాయకులు అర్థం చేసుకొని, ఎలాంటి చర్చలకు ఎలాంటి నాయకులు వస్తున్నారో ఆలోచించి చర్చించడం, అనుకోని కోపాలకు వెళితే వచ్చే దుష్పరిణామాలను ముందుగానే ఆలోచించుకోవడం మేలు. తెలుగుదేశం అనుకూల మీడియా దేనికైనా తెగించే అవకాశం ఉందన్న ఆలోచనతో ముందుకు వెళితేనే వారి పార్టీకి మేలు.

author avatar
Comrade CHE

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju