NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Pawan Kalyan : గెలిస్తే మాది… ఓడితే పవన్ ది!

Pawan Kalyan : తిరుపతి ఉప ఎన్నిక బాధ్యత మొత్తాన్ని బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ భుజం మీద వేసి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి జాతీయ నాయకులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసిన ప్రాధాన్యత తిరుపతికి బిజెపి ఇవ్వడం లేదు. కేవలం రాష్ట్ర స్థాయి నాయకుల ప్రచారంలో పాల్గొంటున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి నాయకులు గెలిస్తే తమ గెలుపుగా ఓడితే పవన్ ఓటమి గా చూపించాలని భావిస్తున్నారు. ఈ కారణంతోనే జాతీయ నాయకులు ఎవరు కనీసం తిరుపతి ప్రచారానికి సైతం రావడం లేదు. పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద బాధ్యత వేసి ఆయననే ఓటమికి బాధ్యుడు చేయాలి అన్నది బిజెపి ప్లాన్ గా కనిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన తిరుపతి సభలో సైతం బిజెపి అభ్యర్థి రత్నప్రభ ” నా తమ్ముడు వచ్చాడు ” గెలిపిస్తాడు అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికకు బాధ్యుణ్ణి చేయాలని బీజేపీ ప్లాన్ వేసినట్లు ఇట్టే అర్థమవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడితే పవన్ మేనియా, ఆయన పార్టీ బలం అంత ఏమీ లేదని బీజేపీ చెప్పుకోవడానికి ఉపయోగ పడుతుంది. తిరుపతిలో బిజెపి గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇప్పటి నుంచే దానికి ఎవరు బాధ్యులు అన్న దాన్ని బీజేపీ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు తిరుపతి సభకు వచ్చినప్పుడు ఒకసారి బిజెపి కు టికెట్ కేటాయిస్తే వారు హైదరాబాద్ ఎన్నికల్లో ఎంత బలంగా పోరాడారు అంత బలంగా పోరాడితేనే టికెట్ కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఎలాంటి దృష్టిపెట్టడం లేదు. ఇక పోరాడడం కంటే ముందే ఓటమిని ఒప్పుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఇప్పుడు దీనికి కారణం ఏమని అడుగుతారు? పవన్ కళ్యాణ్ ని ఓటమి భాగ్య చేసే ప్రయాణం చేస్తున్న బీజేపీ కు పవన్ ఎలా సమాధానం చెబుతారు.. అన్న ప్రశ్న ఎదురవుతోంది.

author avatar
Comrade CHE

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju