ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

BJP vs YCP : ఏపిలో సాంగ్ కాంట్రివర్సీ..! బీజేపీ, వైసీపీ మధ్య రంజుభళ రాజకీయం..!!

Share

BJP vs YCP : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ స్టోరీ సినిమా లోని సారంగదరియా పాటపై రాష్ట్రంలో పెద్ద వివాదం నడిచిన సంగతి తెలిసిందే. 2017లో మా టీవీలో నిర్వహించిన రేలారే రేలా ప్రొగ్రామ్ లో జానపద కళాకారిణి కోమలి పాడింది. అయితే ఈ పాట లవ్ స్టోరీ సినిమాతో పాపులర్ అయిన నేపథ్యంలో ఆ పాటను తొలిసారిగా తానే పాడానంటూ కోమలి తెరపైకి రావడంతో ఇది పెద్ద వివాదం అవ్వడం, దానిపై సుద్దాల అశోక్ తేజ ఇవ్వడం అందరికీ తెలిసిందే.

BJP vs YCP song controversy
BJP vs YCP song controversy

ప్రస్తుతం ఈ పాట వివాదం సమసిపోగా, తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రజానీకంలో జోష్ నింపేందుకు రూపొందించిన ఓ జానపద పాట వైసీపీ, బీజేపీ మధ్య కాంట్రివర్సీ అయ్యింది. ఈ పాట మాదంటే మాది అంటూ వైసీపీ, టీడీపీ వాదులాడుకుంటున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ అంటూ ప్రచారంలో హోరెత్తిస్తున్న పాటపై వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ పాటను బీజేపీ కాపీ కొట్టిందని ఆరోపిస్తున్నారు. రాయలసీమ ముద్దు బిడ్డ జగనన్న అంటూ మంగ్లీ పాడిన పాటను వైసీపీ తమ ఎన్నికల ప్రచారంలో వాడుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. మంగ్లీ పాడిన ఈ పాటపై 2019లో డిప్యూటి సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో చేయగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అయ్యింది.

రాయలసీమ ముద్దు బిడ్డ జగనన్న అన్న పాటను భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ అంటూ బీజేపీ మార్చిందని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. నిన్న నెల్లూరులో నామినేషన్ల సందర్భంలో బీజేపీ, వైసీపీ లు ఇదే పాటను వినియోగించాయి. ఈ సాంగ్ తెలంగాణలో జానపద పాటగా ఎంతో ప్రాచుర్యం పొందింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన గాయని గంగా ఈ పాటకు గుర్తింపు తెచ్చింది. ఈ జానపద పాట ఉత్తేజాన్ని కల్గించేదిగా ఉండటంతో ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఈ రెండు పాటలను ఓ సారి మీరు వినండి.

 


Share

Related posts

అమ్మ రాపాక! అధినేతకే బిస్కెట్ వేస్తున్నావే??

Yandamuri

Vasa: ఈ ఆరోగ్య సమస్యలకు వస తో చెక్ పెట్టండి..!!

bharani jella

Sonu Sood: 22 మంది ప్రాణాలను కాపాడిన సోనూసూద్..!!

sekhar