NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ గెలుపుకు వైస్సార్సీపీ వ్యూహం : తిరుపతి సాక్షిగా జరిగేది ఇదే!!

అదేంటి బీజేపీ లాంటి కేంద్ర పార్టీ… అధికారం లో ఉన్న పార్టీ…మూలాలు బలంగా ఉన్న పార్టీని రాష్ట్రం లో అధికారంలో ప్రాంతీయ పార్టీ వైస్సార్సీపీ ఎందుకు గెలిపిస్తుంది ఎలా గెలిపిస్తుంది దానికి గల కారణాలేంటి?? అనే అనేక ప్రశ్నలు హెడ్డింగ్ చూస్తేనే మీ బుర్ర ఇప్పటికే తొలిచేస్తుంటాయి… కానీ మీరు చదివింది నిజమే తిరుపతి లో జరగబోయేది ఇదే… తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు వైఎస్ఆర్సిపి పూర్తి సహాయ సహకారాలు అందించనుంది… ఇది అక్షరాల నిజం… రాజకీయ స్ట్రాటజీ.. అది ఎందుకు అంటే…????


** దక్షిణాదిన ఖచ్చితంగా ఉంచుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఆ విధంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిన రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా ప్రధాన పక్షం గా ఉండాలని గట్టి పట్టు మీద ఉంది. దీనిలో భాగంగా ఇటీవల తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది బిజెపి… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా సీట్లను పెంచుకుని అధికార పార్టీ టీఆర్ఎస్ కు ప్రధాన లక్ష్యంగా బీజేపీ అవతరించింది. తెలంగాణ ఎన్నికల ను దాదాపు సగం హైదరాబాద్ లోని ఓటర్ల నిర్ణయిస్తారు అన్నది ఇక్కడ చెప్పుకోదగ్గది… అంటే తెలంగాణలో ఈసారి అన్ని విశ్లేషించుకొని చూస్తే టీఆర్ఎస్ కు బీజేపీ కు మధ్య మాత్రమే ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
** ఇదే స్ట్రాటజీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయాలన్నది బిజెపి వ్యూహం. దీనికి తిరుపతి ఉప ఎన్నికలను వాడుకోవాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలిస్తేనే బిజెపి బలం ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది.. ఎక్కడ వైఎస్ఆర్సీపీలో ఓడించి బిజెపి అభ్యర్థి గనుక జరిగితే రాష్ట్రంలో సైతం కొందరు నాయకులు బిజెపి వైపు రావడంతో పాటు బిజెపి ప్రధాన పక్షంగా అవడానికి ఓ దారి ఏర్పడుతుంది. ప్రజలు నమ్మకం వస్తుంది. దీంతో ఈసారి కచ్చితంగా వైఎస్ఆర్సిపి కు ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు బిజెపి తిరుపతి ఒక వ్యూహ కేంద్రం గా మార్చింది.

వైస్సార్సీపీ ఎందుకు బీజేపీని గెలిపిస్తుంది అంటే??

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నావ. ఆ పార్టీ రోజురోజుకు క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ప్రధాన పక్షంగా మారి వైఎస్సార్సీపీని ఓడిస్తే కనుక బిజెపికి వచ్చే ఎన్నికల్లో సైతం ప్రధాన పక్షం పాత్రను అధికార వైఎస్ఆర్సిపి ఇస్తుంది.
** అంటే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ పార్టీ పాత్ర పోషిస్తున్న తెలుగుదేశంలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం గా గుర్తింపు లేకుండా చేయాలి అన్నది ఇటు బిజెపి అటు వైఎస్ఆర్సిపి వ్యూహం.
** ప్రజాస్వామ్యంలో ఓటరు రెండు పార్టీలను తన పరిగణలోకి తీసుకుంటారు.. ఒకటి అధికారపక్షం రెండోది ప్రతిపక్షం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఓటర్ భావిస్తాడు. తన ఓటు ఎక్కడ వృధా పోకూడదని ఇతర పార్టీలకు వేసేందుకు అతడు అంత ఆసక్తి చూపడు. అంటే ఓటర్ చూపు ఉంటే అధికార పక్షం వైపు లేకుంటే విపక్షం వైపు మాత్రమే ఉంటుంది ఇది 85 శాతం నిజం. అనేక శాస్త్రీయ విశ్లేషణ లోనూ ఇది బయటపడింది. అందుకే ఎన్నికల్లో ఎప్పుడు అధికార పక్షం విపక్షం మాత్రమే ఎక్కువ ప్రభావం చూపగలవు.
** ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వ్యూహం ఏమిటంటే ఆ ప్రధాన పక్షం వైపు రావాలన్నది.. దానికి తిరుపతి ఉప ఎన్నిక ఓ ప్రధాన ద్వారం కావాలన్నది అందులో హిందుత్వ ప్రధాన వేదికగా పనిచేసే బిజెపికి తిరుపతి పుణ్యక్షేత్రం నియోజకవర్గం మొదట ఖాతాలో చేరితే అది కూడా ఎన్నికల్లో ఓ విధంగా మేలు చేస్తుంది అన్నది లెక్క.
** ఈ లెక్కలు వ్యూహాలు ప్రకారమే బీజేపీ ఇప్పటికే జగన్ ను పలుమార్లు ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతోంది. బిజెపి పెద్దల వ్యూహాల ప్రకారం జగన్కు వెనువెంటనే అపాయింట్మెంట్లు ఇస్తూ అందరూ కలుస్తూ ఆయన పనులు చేస్తున్నారు. అమిత్ షా దీనిపై బలంగా జగన్కు చెప్పినట్లు తిరుపతి ఉప ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి.. అంతర్గతంగా బిజెపికి సహకరించి లోక్సభ స్థానం గెలిచే చూడాలని కోరినట్లు సమాచారం. దీనికి జగన్ సైతం అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.
** దీని ద్వారానే జగన్ కోరుతున్న పోలవరం పూర్తి నిధులు ఇచ్చేందుకు 2018 19 అంచనాల మేరకు పోలవరం కు సంబంధించి 56 వేల కోట్ల కు కేంద్ర జలాశక్తి శాఖ పచ్చ జెండా ఊపడం దీని వ్యూహంలో భాగమే…
ఏది ఏమైనా తిరుపతిలో కచ్చితంగా తమ బలం నిరూపించుకుని ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి ప్రధాన పక్షం బిజెపి అనే… భావన ప్రజల్లో తీసుకురావలెనేది దీనిలో కీలకమైన అంశం. అంటే అడపాదడపా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో ఒక్క ఓటు కూడా టిడిపికి వెళ్లకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కు రావాలి… ఇలా అయితే దక్షిణాదిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారపక్షానికి బలమైన పక్షంగా బిజెపి తయారు కానుంది…

author avatar
Comrade CHE

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?