Raghuramakrishnam Raju: బీజేపీ – వైసీపీ స్ట్రాంగ్ దెబ్బ వేసిన ఆర్ఆర్అర్ ? విజయసాయిరెడ్డి పదవికి ఎసరు ?

Share

Raghuramakrishnam Raju: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్ధి పార్టీలు విజయసాయిరెడ్డిని ముద్దుగా ఏ 2 అంటూ పిలుచుకుంటారు. ఎందుకంటే అనేక ఆర్థిక నేరాల కేసుల్లో ఆయన ఏ 2 గా ఉన్నారు. అటువంటి విజయసాయిరెడ్డి పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) సభ్యుడుగా ఎన్నికయ్యారు. వైసీబీ, బీజేపీ మధ్య ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో చూస్తే తగవులు ఉన్నాయి. వైసీపీ మంత్రులు, కొంత మంది ఎమ్మెల్యేలు బీజేపీ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటువైపు బీజేపీ నుండి కూడా జీవీఎల్ నర్శింహరావు, సోము వీర్రాజు వారి ఆరోపణలను ఖండిస్తున్నారు. సీఎం జైలుకు వెళతారు, ఆయన జైలుకు వెళితే సీఎం కుర్చీ కోసం వాళ్లు కొట్టుకుంటారు, సానుభూతి డ్రామా కోసమే బీజేపీని ఇలా అంటున్నారని సునీల్ ధియోధర్ లాంటి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఏపిలో బీజేపీ, వైసీపీ రాజకీయాలు పిల్లి, ఎలకా మాదిరిగా కొట్టుకుంటునాయి.

కానీ జాతీయ స్థాయిలో చూసుకుంటే పీఏసీలో మెంబర్ గా ఇచ్చారు. దీని బట్టి చూస్తే దొంగాట జరుగుతున్నట్టా లేదా. జాతీయ స్థాయిలో రెండు ఒకటే కదా. అంతెందుకు నెలరోజుల ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సూరేన్ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తే ఏపి సీఎం వైఎస్ జగన్ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే విధంగా హేమంత్ సోరెన్ ను ట్యాగ్ చేస్తూ తప్పు అలా అనకూడదు బీజేపీని, నరేంద్ర మోడీని అలా అనకూడదు. ఆయన పాలన వెలిగిపోతుంది. వ్యాక్సిన్ అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు అంటూ సోరెన్ ఆరోపణలను ఖండించారు. అంటే బీజేపీతో స్నేహహస్తం ఉంది. ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఇలా చేస్తున్నారు. అంటే జాతీయ స్థాయిలో బీజేపీ, వైసీపీ బంధం ఎలా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ల మాటలు, బంధం ఏ విధంగా ఉంది అనేది మొత్తం డాక్యుమెంట్ అవిడెన్స్ పెట్టుకుని రఘురామకృష్ణం రాజు జాతీయ మీడియాలో అందరికీ తెలిసేలా వైసీపీ డబుల్ గేమ్ ఏ విధంగా ఆడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో సానుభూతి కోసం డ్రామాలు ఆడుతోంది. ఢిల్లీ స్థాయిలో పదవుల కోసం, కేసుల నుండి తప్పించుకోవడం కోసం సాగిలపడుతోంది. ఇవన్నీ రఘురామకృష్ణం రాజు సేకరించి జాతీయ మీడియాలో హైలెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రోజు వారి ఆయన ప్రెస్ మీట్ లో అన్ని చెబుతూనే ఈ రోజు గానీ రేపు గానీ అన్ని అవిడెన్స్ తో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు.

మరో వైపు విజయసాయి రెడ్డికి ఆ పదవికి అనర్హుడని, ఆ పదవిలో ఉండటానికి వీలు లేదని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అది పార్లమెంట్ పదవి కాబట్టి వేస్తే ఢిల్లీ హైకోర్టులో వేయాలి లేదంటే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి. న్యాయపరంగానే విజయసాయి రెడ్డి పదవి తొలగించేందుకు రఘురామ కృష్ణంరాజు ఒక ప్రణాళిక వేశారు. ఎందుకంటే ఆయన అనేక ఆర్థిక నేరాల కేసులో ఏ 2గా ఉన్నారు, ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. బెయిల్ కూడా అనేక కండిషన్లతో ఉంది. అటువంటి వ్యక్తికి ప్రజా పద్దుల కమిటీలో ఎలా చోటు ఇస్తారు, అయన అనర్హుడు, అనైతికం అని రఘురామకృష్ణంరాజు వాదిస్తున్నారు. ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఇప్పుడు పీఎసి పదవిలో ఆయన ఉండటానికి వీలులేదు, ఆయనను తొలగించాలంటూ న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఒక వైపు జాతీయ స్థాయి మీడియాలో దీన్ని హైలెట్ చేస్తూ రాజకీయంగా, మరో పక్క న్యాయపరంగా కోర్టులో వేసి రెండు విధాలుగా ఇష్యూ చేయడానికి రఘురామ కృష్ణం రాజు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.


Share

Related posts

Obesity: ఊబగాయంతో ఇబ్బంది పడుతున్నారా..ఇది ట్రై చేసి చూడండి ..14 రోజుల్లో మంచి ఫలితం..

bharani jella

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ప్రాణమేపోయింది!వాహనదారులారా బహుపరాక్ !!

Yandamuri

Adipurush: ‘ఆదిపురుష్’ లేటెస్ట్ అప్డేట్.. 2022లో ప్రభాస్ నుంచి 3 పాన్ ఇండియన్ సినిమాలు..

GRK