Black Fungus: ఏపిలో కొత్త టెన్షన్ ..! బ్లాక్ ఫంగస్‌ లక్షణాలతో నలుగురు మృతి..!!

Share

Black Fungus: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న ప్రజానీకానికి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తుండటంతో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఏపిలోనూ బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో ఏపిలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందినట్లు సమాచారం. అధికారికంగా పదికి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. పలువురు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్లాక్ ఫంగస్ గుప్పిట్లో చిక్కుకున్నట్లు కన్పిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా బయటపడుతుండటంతో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా కేసుల్లో కరోనా నుండి కోలుకున్న తరువాత ముక్కు, చెవి, గొంతు ద్వారా సంక్రమించే ఈ ఫంగస్ చివరకు ప్రాణాంతకం అవుతోంది. కోవిడ్ తగ్గింది అనుకున్న వారిలో కన్ను, దవడ వాపు లక్షణాలు కొందరిలో వస్తున్నాయి. అయితే ఈ బ్లాక్ ఫంగస్ పై పూర్తిగా అవగాహన లేకపోవడంతో ఈఎన్‌టీ సమస్యలు ఉన్న వారు తమకు బ్లాక్ ఫంగస్ ఉందన్న భయంతో ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.

 

Black Fungus: బ్లాక్ ఫంగస్ అంటే ..

బ్లాక్ ఫంగస్ ను వైద్య పరిభాషలో మ్యూకార్ మైకోసిస్ గా పిలుస్తుంటారు. కళ్లు, మెదడుపై దాడి చేసే ఈ ఫంగస్ ను సకాలంలో గుర్తించకపోతే చివరకు ప్రాణాలను హరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఈఎన్‌టీ నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవాలి. ఏపిలో బ్లాక్ ఫంగస్ ప్రమాదం పొంచి ఉన్న మాట వాస్తవమేనని ఆంధ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆసుపత్రి యాజమాన్యాలకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కోరారు.

 

 


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

18 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

41 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago