శ్రీశైలం దేవస్థానంలో పెను ప్రమాదం తప్పింది. నిత్య అన్నదాన భవనంలో వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది. ఒక్క సారిగా బాయిలర్ పేలుడుతో ఉద్యోగ సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. నిత్య అన్నదాన భవనం బయట వైపు పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. వేడి ఎక్కువ కావడంతో ప్రజర్ కు పేలినట్లు సిబ్బంది తెలిపారు. వేడి నీళ్లు పడటం వల్ల ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఆలయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరో పక్క క్షేత్రంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాత్రి ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనున్నది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్రం లో నేటి నుండి అన్ని ఆర్జిత సేవలను అధికారులు నిలుపుదల చేశారు.
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత కుమారుడు అరెస్ట్