NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని డిపార్ట్ మెంట్ టెస్ట్ పాస్ అయిన వారందరి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Breaking AP Govt good news To village and ward secretariat employees
Breaking AP Govt good news To village and ward secretariat employees

Breaking: ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు

ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంతకం చేయగా, ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీస్ (ప్రొబేషన్ పిరిడ్) గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ నాటికి పూర్తి అయినప్పటికీ రాష్ట్ర అర్ధిక పరిస్థితి మూలంగా ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ ను వాయిదా వేసింది. జూన్ నెలలో చేస్తామని ఉద్యోగ సంఘాల ఆందోళన సమయంలో సీఎం జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు.

 

కాగా, ఆర్ధిక శాఖ అధికారులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు పాత పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాన్ని పక్కన బెట్టి కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk