ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపిలో నైట్ కర్ఫ్యూ..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

Share

Breaking: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో కఠిన ఆంక్షలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నైట్ కర్ఫ్యూకు ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5గంటలకు వరకూ ఏపిలో కర్ఫ్యూ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా సినిమా థియేటర్ లు 50 శాతం అక్యుపెన్సీతో నడుపుకోవాలని ఆదేశించారు.

Breaking: ap Govt imposed night curfew
Breaking: ap Govt imposed night curfew

 

Read More: MLA Prasanna Kumar Reddy:’సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు

Breaking: ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలనీ, ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ లు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా బాధితులకు ఇచ్చే హోం ఐసోలేషన్ కిట్ లలో మార్పులు చేయాలని సూచించారు. మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధించాలనీ, ఆర్ టీసీ బస్సుల్లోనూ విధిగా ప్రయాణీకులు మాస్క్ ధరించేలా చూడాలనీ చెప్పారు. 104 కాల్ సెంటర్ సేవలను బలోపేతం చేయాలని, బహిరంగ కార్యక్రమాలకు 200 మందికి, ఇండోర్ కార్యక్రమాలకు వంద మందికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.


Share

Related posts

‘మీ రాక మాకెంతో సంతోషమండి’

somaraju sharma

అర్ధరాత్రి తినే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయం!!

Kumar

Big Breaking: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

somaraju sharma