Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని డిపార్ట్ మెంట్ టెస్ట్ పాస్ అయిన వారందరి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం ఇంతకు ముందే నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంతకం చేయగా, ఈ రోజు అందుకు సంబంధించిన జివోను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీస్ (ప్రొబేషన్ పిరిడ్) గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ నాటికి పూర్తి అయినప్పటికీ రాష్ట్ర అర్ధిక పరిస్థితి మూలంగా ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ ను వాయిదా వేసింది. జూన్ నెలలో చేస్తామని ఉద్యోగ సంఘాల ఆందోళన సమయంలో సీఎం జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు.
కాగా, ఆర్ధిక శాఖ అధికారులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు పాత పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాన్ని పక్కన బెట్టి కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల వరకూ 15వేల వేతనంతో పని చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జూలై నెల నుండి నూతన పేస్కేల్ కు అనుగుణంగా జీతాలు పొందనున్నారు. నూతన పిఆర్సీ ప్రకారం జీతాలు పెంపు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…